శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 22 అక్టోబరు 2017 (15:29 IST)

తమన్నా సరసన గుంటూరు టాకీస్ సిద్ధూ.. క్వీన్ రీమేక్‌లో ఛాన్స్

బాహుబలికి తర్వాత ఆశించిన స్థాయిలో హిట్ సినిమాలు లేకుండా అందాల రాశి తమన్నా నానా తంటాలు పడుతోంది. బాహుబలికి తర్వాత నాలుగైదు సినిమాల్లో నటించినా అవి అంతగా గుర్తింపు సంపాదించిపెట్టలేదు. ఈ నేపథ్యంలో బాలీవు

బాహుబలికి తర్వాత ఆశించిన స్థాయిలో హిట్ సినిమాలు లేకుండా అందాల రాశి తమన్నా నానా తంటాలు పడుతోంది. బాహుబలికి తర్వాత నాలుగైదు సినిమాల్లో నటించినా అవి అంతగా గుర్తింపు సంపాదించిపెట్టలేదు. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన ‘క్వీన్’ సినిమాను దక్షిణాది భాషల్లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. 
 
ఈ చిత్రాన్ని తెలుగులో కూడా ఈ సినిమా ‘క్వీన్’ అనే పేరుతోనే విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంలో తమన్నా సరసన యువ హీరో నటించనున్నాడు. ''గుంటూరు టాకీస్'' సినిమాలో హీరోగా నటించిన సిద్ధూ తమన్నా సరసన నటించే అవకాశాన్ని కైవసం చేసుకున్నాడు. హిందీలో ఈ పాత్రను రాజ్ కుమార్ రావు లాంటి ప్రముఖ నటుడు పోషించాడు. 
 
కానీ తెలుగులో మాత్రం సిద్ధూను ఎంపిక చేసుకోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు  సినీ పండితులు. ఈ సినిమాకు దర్శకుడిగా నీలకంఠ వ్యవహరించనున్నారు. తమిళంలోనూ నీలకంఠనే రీమేక్ చేస్తున్నారు.