శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By tj
Last Updated : గురువారం, 19 అక్టోబరు 2017 (15:01 IST)

పీకే సర్వేలో నమ్మలేని నిజాలు.. జగన్‌కు షాక్...

వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ సలహాదారుగా నియమితమైన ప్రశాంత్ కిషోర్ (పీకే)పై ఆశక్తికరమైన చర్చ ఒకటి సాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న రాజకీయాలపై సర్వే చేయించారు ప్రశాంత్ కిషోర్.

వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ సలహాదారుగా నియమితమైన ప్రశాంత్ కిషోర్ (పీకే)పై ఆశక్తికరమైన చర్చ ఒకటి సాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న రాజకీయాలపై సర్వే చేయించారు ప్రశాంత్ కిషోర్. రెండు టీంలతో ఇప్పటికే రెండు సార్లు ప్రశాంత్ కిషోర్ సర్వే చేయించారు. ఈ సర్వే వివరాలను జగన్ ముందుంచారు. సర్వే చూసిన జగన్ ఆశ్చర్యపోయారు. సర్వేపై పార్టీ అధినాయకులతో చర్చించాలని నిర్ణయానికి వచ్చారు జగన్. ఈ నెలాఖరులోనే సమావేశాన్ని నిర్వహించనున్నారు.
 
ఎందుకంటే నవంబర్ 2 నుంచి పాదయాత్ర చేయబోతున్నారు. అంతకు ముందుగానే సమావేశాన్ని పెట్టి సర్వే రిపోర్టులపై పార్టీ నేతలతో చర్చలు జరిపి వచ్చే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్ళాలన్న దానిపై సుధీర్ఘంగా చర్చించాలని జగన్ నిర్ణయించుకున్నారు. అంతేకాదు.. నియోజకవర్గంలో బలంగా లేని వారికి సీట్లు ఇవ్వకూడదన్న నిర్ణయానికి కూడా వచ్చేశారట. ఈ సూచన కూడా పీకేనే చేశారట.