దీపావళికి బంపర్ ఆఫర్స్.. రెడ్ మీ నోట్ 4 రూ.10,999లకే

దీపావళిని పురస్కరించుకుని ఈ-కామర్స్ సంస్థలు భారీ ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. తాజాగా ఫ్లిప్‌కార్ట్ ఆకర్షణీయమైన ఆఫర్లతో వచ్చేసింది. ఈ నెల 14 నుంచి 17వ తేదీ వరకు నాలుగు రోజులపాటు నిర్వహించనున్న ఈ సేల్‌లో మొ

redmi 4a
selvi| Last Updated: శనివారం, 14 అక్టోబరు 2017 (08:40 IST)
దీపావళిని పురస్కరించుకుని ఈ-కామర్స్ సంస్థలు భారీ ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. తాజాగా ఫ్లిప్‌కార్ట్ ఆకర్షణీయమైన ఆఫర్లతో వచ్చేసింది. ఈ నెల 14 నుంచి 17వ తేదీ వరకు నాలుగు రోజులపాటు నిర్వహించనున్న ఈ సేల్‌లో మొబైల్స్‌పై భారీ ఆఫర్లు ప్రకటించింది. బై బ్యాక్ ఆఫర్‌తో పాటు డెబిట్ కార్డులతో కొనుగోలు చేసే వారికి అదనంగా పదిశాతం రాయితీ ఇస్తోంది. బై-బ్యాక్ ఆఫర్‌తో హెచ్‍‌డీఎఫ్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రాయితీలను ప్రకటించింది.

షియోమీ రెడ్ మీ నోట్ 4 అసలు ధర రూ.12,999 కాగా దానిని రూ.10,999లకే అందిస్తోంది. మోటో సి ప్లస్‌ను రూ.5,999కే అందిస్తుండగా దాని అసలు ధర రూ.6,999. లెనోవో కే8 ప్లస్ (3జీబీ) అసలు ధర రూ.10,999 కాగా దానిని రూ.8,999కే ఇవ్వనున్నట్టు సమాచారం. అలాగే మోటో టర్బో, మోటో ఎక్స్, హవేయి, లీఎకో లీ మ్యాక్స్ 2, గూగుల్ పిక్సెల్ (32 జీబీ) తదితర వంటిపై ఆఫర్లను ఈ-కామెర్స్ సంస్థలు ఆఫర్లు ప్రకటించాయి.

ఆఫర్ల వివరాలు..
మోటో సి ప్లస్‌ను రూ.5,999కే అందిస్తుండగా దాని అసలు ధర రూ.6,999. లెనోవో కే8 ప్లస్ (3జీబీ) అసలు ధర రూ.10,999 కాగా దానిని రూ.8,999కే ఇవ్వనున్నట్టు ఫ్లిఫ్ కార్ట్ ప్రకటించింది.దీనిపై మరింత చదవండి :