అక్టోబర్ 8 వరకు ఫెస్టివ్ ధమాకా డేస్ సేల్..

ఫెస్టివ్ ధమాకా డేస్ సేల్ ప్రారంభమైంది. ఫ్లిప్‌కార్ట్‌లో గురువారం ప్రారంభమైన ఈ సేల్ అక్టోబరు 8 వరకు కొనసాగనుంది. ఈ పండుగ సీజన్‌లో ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తున్న రెండో అతిపెద్ద సేల్ ఇదేనని కంపెనీ ప్రకటించ

flipkart
pnr| Last Updated: గురువారం, 5 అక్టోబరు 2017 (21:16 IST)
ఫెస్టివ్ ధమాకా డేస్ సేల్ ప్రారంభమైంది. ఫ్లిప్‌కార్ట్‌లో గురువారం ప్రారంభమైన ఈ సేల్ అక్టోబరు 8 వరకు కొనసాగనుంది. ఈ పండుగ సీజన్‌లో ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తున్న రెండో అతిపెద్ద సేల్ ఇదేనని కంపెనీ ప్రకటించింది.

యాక్సిస్ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకున్న ఫ్లిప్‌కార్ట్ ఆ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డ్‌లతో కొనుగోలు జరిపే వారికి పదిశాతం క్యాష్ బ్యాక్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఫోన్‌పే ద్వారా ఆర్డర్ చేసే వారికి 20 శాతం క్యాష్ బ్యాక్ ప్రకటించింది.

ఈ రాయితీలో భాగంగా ఫోన్లకు భారీ ఆఫర్లను ఫ్లిఫ్ కార్ట్ ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.64వేల ఐఫోన్ 8ను రూ.59,999కే అందిస్తోంది. షియోమీ రెడ్‌మీ నోట్ 4, 64 జీబీ వేరియంట్‌ను రూ.10,999కే ఆఫర్ చేస్తోంది. దీని అసలు ధర రూ.12,999. ఇదే విధంగా ఇతర బ్రాండ్ స్మార్ట్ ఫోన్లతో పాటు తదితర వస్తువులపై ఫ్లిఫ్ కార్ట్ భారీ బంపర్ సేల్‌ను ప్రకటించింది.దీనిపై మరింత చదవండి :