శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 22 సెప్టెంబరు 2017 (10:19 IST)

రజనీకాంత్‌ను కలిశాను.. అదో బలవంతపు వివాహం: కమల్ హాసన్

తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ రాజకీయ అరంగేట్రంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి తాను ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే ఆలోచన లేదన్నారు. ఒంటరిగానే ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. వంద రోజుల్లో ఎన్నికల

తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ రాజకీయ అరంగేట్రంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి తాను ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే ఆలోచన లేదన్నారు. ఒంటరిగానే ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. వంద రోజుల్లో ఎన్నికలు జరిగినా తాను తప్పకుండా బరిలోకి దిగుతానని తేల్చి చెప్పారు. అన్ని పార్టీలకు సహకరిస్తానని, అయితే ఎన్నికల్లో మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు.
 
అన్నాడీఎంకేలో నెలకొన్న వివాదాలపై కమల్ స్పందిస్తూ.. అదో బలవంతపు వివాహమని.. ఈ పెళ్లి నుంచి వధువు బయటకు రావాలని తమిళ ప్రజలు కోరుకుంటున్నారని కమల్ పేర్కొన్నారు. వచ్చే మూడు నెలల్లో కనుక ఎన్నికలు జరిగితే తాను తప్పనిసరిగా పోటీ చేస్తానని పునరుద్ఘాటించారు. 
 
కమల్ హాసన్ మరో షాకింగ్ విషయం కూడా తెలిపారు. తాను సహ నటుడు రజనీకాంత్‌ను కలిశానని.. ఆయన తన వెన్నుతట్టి అభినందించారని కమల్ పేర్కొన్నారు. నాలుగైదు వారాల క్రితం తాను రజనీని కలిశానని కమల్ వెల్లడించారు. ఇద్దరికీ ఒక రకమైన లక్ష్యం ఉందని.. తొలుత అవినీతి రూపుమాపాల్సి వుందని కమల్ తెలిపారు. ఇద్దరి లక్ష్యం ఒకటే అయినా దారులు మాత్రం వేరని కమల్ స్పష్టం చేశారు.