బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 28 సెప్టెంబరు 2017 (18:21 IST)

ఫెస్టివల్ ఆఫర్లు.. వ్యాపారంలో ఫ్లిఫ్‌కార్ట్ అదుర్స్.. అమేజాన్ చిత్తుగా ఓడిపోయింది..

ఈ-కామర్స్ సంస్థలు పండుగలకు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా ఈ సీజన్‌లో ''బిగ్ బిలియన్ డేస్‌'' పేరుతో జరిపిన విక్రయాల ద్వారా ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ రూ.5000 కోట్లు సేకరించగా, ఇదే సీ

ఈ-కామర్స్ సంస్థలు పండుగలకు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా ఈ సీజన్‌లో ''బిగ్ బిలియన్ డేస్‌'' పేరుతో జరిపిన విక్రయాల ద్వారా ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ రూ.5000 కోట్లు సేకరించగా, ఇదే సీజన్లో అమేజాన్ సంస్థ రూ.2500 నుంతి రూ.2700  కోట్ల మేర ఆర్జించింది.
 
ఇక పండుగ సీజన్‌ అమ్మకాల్లో అమేజాన్ సంస్థ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. ఈ క్రమంలో గత ఆదివారంతో ముగిసిన ఐదు రోజుల బిగ్ బిలియన్ డేస్ విక్రయాల్లో ఫ్లిప్‌కార్ట్ రూ.5,000 కోట్లపైగానే వ్యాపారం జరిపింది.  
 
ఇక దేశంలో అతిపెద్ద ఆన్‌లైన్ సంస్థగా అవతరించింది ఫ్లిఫ్ట్ కార్ట్. అమేజాన్‌ను ఓడించడం ద్వారా వ్యూహాత్మక ఆధిపత్యం కొనసాగించింది. ఫెస్టివల్ సీజన్ ద్వారా ఈ-కామర్స్ సంస్థలకు మంచి ఆదాయం పెరిగిందని.. విశ్లేషకులు అంటున్నారు. ఆన్‌లైన్ వ్యాపారం 25 శాతం పైగానే వృద్ధి సాధించిందని పేర్కొంటున్నారు.