సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 20 సెప్టెంబరు 2017 (16:45 IST)

10 రోజుల పాటు అత్యాచారం.. మతం మార్చుకోమని.. మాంసం తినమన్నారు..

అత్యాచారంతో పాటు మాత మార్పిడి, బలవంతంగా మాంసం తినమని ఒత్తిడి చేసి.. హింసించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. యూపీలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 16 ఏళ్ల బాధిత బాలిక ముజఫర్‌ నగర్‌కు దగ్గరలోని

అత్యాచారంతో పాటు మాత మార్పిడి, బలవంతంగా మాంసం తినమని ఒత్తిడి చేసి.. హింసించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. యూపీలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 16 ఏళ్ల బాధిత బాలిక ముజఫర్‌ నగర్‌కు దగ్గరలోని కుక్రా గ్రామంలో దగ్గరి బంధువులతో కలిసి జీవిస్తోంది. ఈమెను ఈ నెల ఆరో తేదీన నలుగురు దుండగులు కిడ్నాప్ చేశారు.
 
నలుగురు దుండగులు బలవంతంగా బాలికను కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. వరుసగా పది రోజులపాటు బాధితురాలిని నిర్భంధించి.. అత్యాచారం చేయడంతో పాటు ఆమె పట్ల దారుణంగా ప్రవర్తించారని పోలీసులు తెలిపారు. నిందితులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంతో పాటు, పోస్కో పోలీసులు వెల్లడించారు. కిడ్నాప్ చేసి పదిరోజుల పాటు నలుగురు దుండగులు అత్యాచారం చేశారు. 
 
మతం మార్చుకోమని వేధించారు. బలవంతంగా మాంసం తినమని ఒత్తిడి కూడా చేశారని పోలీసులు తెలిపారు. నిందితులు అక్రమ్‌, అస్లామ్‌, ఆయూబ్‌, సలీమ్‌ అనే నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.