శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 11 అక్టోబరు 2017 (06:04 IST)

హిందువుల అంత్యక్రియలపై కూడా నిషేధం ఉంటుందేమో : త్రిపుర గవర్నర్ సెటైర్

త్రిపుర గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వాయు కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా, దేశ రాజధాని ఢిల్లీలో దీపావళి పండుగను పురస్కరించుకుని పటాసులు అమ్మకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయంతెల్సింద

త్రిపుర గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వాయు కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా, దేశ రాజధాని ఢిల్లీలో దీపావళి పండుగను పురస్కరించుకుని పటాసులు అమ్మకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయంతెల్సిందే. ఈ నిషేధం నవంబరు ఒకటో తేదీ వరకు అమల్లో ఉంటుంది. 
 
దీనిపై త్రిపుర గవర్నర్ తథాగథరాయ్ స్పందిస్తూ... పటాసులపై నిషేధం తర్వాత ఇక హిందువుల అంత్యక్రియలపై నిషేధం ఉంటుందేమోనని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో అవార్డులు వెనక్కిస్తున్న వారు, కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించే వారు.. ఇక‌ హిందువుల అంత్యక్రియలపై నిషేధం విధించాలని కోర్టును ఆశ్ర‌యిస్తారేమోన‌ని ఆయ‌న వ్యంగ్యంగా అన్నారు. ఏడాదికి ఒక్కరోజు చేసుకునే దీపావళితోనే కాలుష్య స‌మ‌స్య వ‌స్తుందా? అంటూ ఆయన సందేహాన్ని లేవనెత్తారు. 
 
కాగా, రాజ్యాంగ పదవిలో ఉండే ఓ రాష్ట్ర గవర్నర్ దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలపై ఈ తరహా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇపుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. పలువురు ఆయనకు మద్దతు తెలుపుతుంటే మరికొందరు విమర్శలు చేస్తున్నారు.