శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 10 అక్టోబరు 2017 (16:05 IST)

క్రిస్మస్ ట్రీలు, మొహర్రం రక్తపాతం ఆపే దమ్ముందా : చేతన్ భగత్

దేశ రాజధాని ఢిల్లీలో నవంబరు ఒకటో తేదీవరకు టపాకాయల విక్రయాలపై సుప్రీంకోర్టు ఇటీవల నిషేధం విధించింది. దీనిపై దేశ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఇదే అంశంపై ప్రముఖ రచయిత చేతన్ భగవత్ ట్విట్టర్ వేదికగా కొన్ని ప

దేశ రాజధాని ఢిల్లీలో నవంబరు ఒకటో తేదీవరకు టపాకాయల విక్రయాలపై సుప్రీంకోర్టు ఇటీవల నిషేధం విధించింది. దీనిపై దేశ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఇదే అంశంపై ప్రముఖ రచయిత చేతన్ భగవత్ ట్విట్టర్ వేదికగా కొన్ని ప్రశ్నలు సంధించారు. ఢిల్లీలో టపాసుల అమ్మకాన్ని నిషేధించడాన్ని పలువురు సమర్థిస్తున్నారు. ఇలాంటి వారు తాను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ ఆయన కోరారు. 
 
హిందూ మతానికి చెందిన పండగలపైనేనా మీ ప్రతాపం.. మొహర్రం రోజు జరిగే రక్తపాతాన్ని ఆపే దమ్ముందా అంటూ ప్రశ్నించాడు. పటాకులపై నిషేధం అంటే క్రిస్మస్ సమయంలో క్రిస్మస్ ట్రీలు, బక్రీదు సమయంలో గొర్రెల బలిపై నిషేధించినట్లు ఉందని, ఏదైనా నియంత్రించండి తప్ప నిషేధం వద్దని సూచించాడు. 
 
కొందరు దీనికి మద్దతుగా చేసిన ట్వీట్లకు కూడా చేతన్ సమాధానమిచ్చాడు. మీకు కాలుష్య నియంత్రణపై అంత శ్రద్ధ ఉంటే కార్లు వాడకండి.. ఓ వారం రోజులు ఇంట్లో కరెంటు వాడకండి.. అంతేగానీ ఏడాదిలో ఒక్క రోజు జరిగే దీపావళి పండుగ వల్లే కాలుష్యం పెరిగిపోతుందని ఎలా అంటారు అని నిలదీశాడు. అతని సూటి ప్రశ్నలతో ట్విట్టర్‌లో పటాకుల నిషేధంపై చర్చ మరింత రాజుకుంది.