శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 10 అక్టోబరు 2017 (10:40 IST)

భర్త కళ్లెదుటే 30 ఏళ్ల మహిళపై గ్యాంగ్ రేప్... బైకుపై వెళుతుంటే...

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు ఆగడంలేదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్‌లో 30 ఏళ్ల మహిళపై ఆమె కట్టుకున్న భర్త ఎదుటే నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... తమ బిడ్డకు ఆరోగ్యాన్ని చె

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు ఆగడంలేదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్‌లో 30 ఏళ్ల మహిళపై ఆమె కట్టుకున్న భర్త ఎదుటే నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
 
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... తమ బిడ్డకు ఆరోగ్యాన్ని చెక్ చేయించుకునేందుకు భార్యాభర్తలు ఇద్దరూ ఆసుపత్రికి వెళ్లి వస్తున్నారు. మార్గమధ్యంలో వారి బైకును నలుగురు వ్యక్తులు అడ్డుకున్నారు. ఆ తర్వాత వారిని బైకు పైనుంచి కిందికి లాగి సమీపంలో వున్న చెరకు తోటలోకి తీసుకెళ్లారు. 
 
అక్కడ ఆమె భర్తను ఓ చెట్టుకు కట్టేశారు. ఆ తర్వాత మహిళపై అత్యాచారానికి ప్రయత్నించగా ఆమె ప్రతిఘటించింది. అలా అయితే పసిబిడ్డను చంపేస్తామని ఆమెను బెదిరించి బలవంతంగా ఆమెపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఘటనా ప్రదేశంలో పసిబిడ్డ ఏడుపులు, మహిళ అరుపులను సమీపంలో పొలం పనులు చేసుకుంటున్న రైతులు విని పరుగు పరుగున వచ్చారు. కానీ అప్పటికే ఆ నలుగురు కామాంధులు పరారయ్యారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.