శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 7 సెప్టెంబరు 2017 (15:38 IST)

రేప్ చేశామని చెప్పేస్తావా? ఐతే చావు... యువతిపై రేప్, చంపి మూటగట్టి...

స్నేహితుడే కదా అని నమ్మి వస్తే మరో స్నేహితుడితో కలిసి 22 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం చేశాడు ఆ కామాంధుడు. విషయాన్ని పోలీసులకు చెప్తానని బాధితురాలి చెప్పడంతో... ఐతే ఇక నువ్వు చావంటూ ఆమెను హత్య చేసి, ఆ తర్వాత ఆమె మృత దేహాన్ని ఓ సూట్ కేసులో పెట్టి ముర

స్నేహితుడే కదా అని నమ్మి వస్తే మరో స్నేహితుడితో కలిసి 22 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం చేశాడు ఆ కామాంధుడు. విషయాన్ని పోలీసులకు చెప్తానని బాధితురాలి చెప్పడంతో... ఐతే ఇక నువ్వు చావంటూ ఆమెను హత్య చేసి, ఆ తర్వాత ఆమె మృత దేహాన్ని ఓ సూట్ కేసులో పెట్టి మురుగు కాల్వలో పడేశారు కామాంధులు.
 
వివరాల్లోకి వెళితే... 22 ఏళ్ల యువతి నాగపూర్‌లో ఇంజినీరింగ్ చదువుతోంది. ఈమె తండ్రి అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టరుగా పనిచేస్తున్నారు. తన క్లోజ్ ఫ్రెండును కలిసేందుకు బాధితురాలు పుణె వచ్చింది. ఈ క్రమంలో ఆమె తిరుగు ప్రయాణం అవుతున్న సమయంలో పాటిల్ తనతో రమ్మని చెప్పాడు. నమ్మి అతడి వెంట వెళ్లిందామె. 
 
అంతే... ఆ రోజు రాత్రి పాటిల్ తన స్నేహితుడు వలోడే అనే యువకుడు కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె పోలీసులకు చెపుతానని రోదిస్తూ వుండటంతో... వెంటనే ఆమెను ఇనుప రాడ్లతో కొట్టి చంపి ఆమె మృత దేహాన్ని సూట్ కేసులో పెట్టి మరో స్నేహితుడు ఖోబ్రాగడేకి తెలియకుండా అతడి కారు డిక్కీలో పెట్టారు. 
 
అక్కడి నుంచి అంతా గోవా పయనమయ్యారు. మార్గమధ్యంలో ఓ చోట కారు ఆపించి ఆ మృత దేహాన్ని ఓ మురుగు కాల్వలో పడేశారు. ఆ తర్వాత విషయాన్ని ఖోబ్రాగడేకి చెప్పారు. దాంతో అతడు విషయాన్ని పోలీసులకు చేరవేయడంతో రంగంలోకి దిగి నిందితులను అదుపులోకి తీసుకుని వారిపై అత్యాచారం, హత్య నేరాల కింద కేసు నమోదు చేశారు.