ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 4 సెప్టెంబరు 2017 (12:53 IST)

తల్లితో వివాహేతర బంధం... కుమార్తెను తల్లిని చేశాడు...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఓ దారుణం జరిగింది. తల్లితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూనే ఆమె కుమార్తెను కూడా తల్లిని చేశాడో ఓ కామాంధుడు. జిల్లాలోని ప్యాపిలిలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఓ దారుణం జరిగింది. తల్లితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూనే ఆమె కుమార్తెను కూడా తల్లిని చేశాడో ఓ కామాంధుడు. జిల్లాలోని ప్యాపిలిలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
జిల్లాలోని హెచ్‌ఆర్‌ పల్లికి చెందిన ఓ మహిళకు కొన్నేళ్ళ క్రితం భర్త చనిపోయాడు. ఈమెకు 22 యేళ్ల కుమార్తె ఉంది. దీంతో తన బిడ్డతో కలిసి ప్యాపిలి చేరుకుని, ఓ హోటల్‌లో పాచిపని చేసుకుంటూ జీవనం సాగిస్తూ వస్తోంది.  
 
ఈ క్రమంలో ఇదే ప్రాంతానికి చెందిన ఎద్దుల వ్యాపారి సుబ్రహ్మణ్యం(60) అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇది వివాహేతర సంబంధంగా మారింది. ఈ క్రమంలోనే అతడి కన్ను ఆమె 22 యేళ్ళ కుమార్తెపై కూడా పడింది. 
 
ఈ పరిస్థితుల్లో తల్లి ఇంట్లో లేని సమయంలో ఆమెపై అత్యాచారం చేశాడు. ఆపై ఈ విషయం బయటకు చెపితే చంపేస్తానని బెదిరించాడు. ఆ తర్వాత ఆమెపై రోజూ అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఇలా యేడాదిన్నర పాటు కొనసాగింది. 
 
దీంతో ఆ యువతి గర్భందాల్చింది. దీంతో తల్లి నిలదీయగా ఆమె జరిగిన విషయాన్ని బహిర్గతం చేసింది. ఈ క్రమంలో ఆ యువతి వారం రోజుల క్రితం ఆడ శిశువుకు జన్మనిచ్చింది. దీంతో తల్లీకూతుళ్లు ప్యాపిలి పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆ కామాంధుడిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.