శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 6 సెప్టెంబరు 2017 (11:32 IST)

బ్లూవేల్ గేమ్‌ ఎఫెక్ట్: సరస్సులో దూకేసిన 17ఏళ్ల బాలిక..

బ్లూవేల్ గేమ్‌తో చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ ఆటలో నిమగ్నమై తమకు తాముగానే ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తాజాగా రాజస్థాన్‌లో బ్లూవేల్ గేమ్ ఆడుతూ.. 17 ఏళ్ల బాలిక సరస్సులో దూకేసింది. వివరాల్లోకి

బ్లూవేల్ గేమ్‌తో చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ ఆటలో నిమగ్నమై తమకు తాముగానే ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తాజాగా రాజస్థాన్‌లో బ్లూవేల్ గేమ్ ఆడుతూ.. 17 ఏళ్ల బాలిక సరస్సులో దూకేసింది. వివరాల్లోకి వెళితే జోధ్‌పూర్‌కు చెందిన ఓ బీఎస్‌ఎఫ్‌ జవాను కుమార్తె నిన్న రాత్రి మార్కెట్‌కు వెళ్తానని చెప్పి ఇంటి నుంచి బయటకొచ్చింది. బాలిక ఎంతకీ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆమెకు ఫోన్‌ చేశారు.
 
బాలిక ఎంతకీ ఇంటికి తిరిగి  రాకపోవడంతో జోధ్‌పూర్‌కు చెందిన ఓ బీఎఎస్ఎఫ్ జవాను కూతురు మంగళవారం రాత్రి మార్కెట్‌కు వెళ్తానని చెప్పి ఇంటి నుంచి బయటికి వచ్చింది. బాలిక రెండు మూడు గంటల సేపైనా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆమెకు ఫోన్‌ చేశారు. అయితే ఫోన్‌ను తమ కుమార్తె కాకుండా గుర్తుతెలియని వ్యక్తి లిఫ్ట్‌ చేశాడు. దీంతో ఆందోళనకు గురైన బాలిక తల్లిదండ్రులు ఆమె కోసం పరిసర ప్రాంతాల్లో గాలించారు.
 
సరస్సుకు కొద్ది దూరంలో బాలిక స్కూటీ కన్పించడంతో వెంటనే వారు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఎంత చెప్పినా వినిపించుకోకుండా అక్కడి నుంచి సరస్సులోకి దూకేసింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు డ్రైవర్ల సాయంతో ఆమెను కాపాడారు. ఆపై ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా బ్లూవేల్ గేమ్ కారణంగా ఆమెకు ఆత్మహత్యా యత్నానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు. ఆమె చేతిపై కత్తితో బ్లూవేల్‌ ఆకారంలో గీసుకున్న గుర్తులున్నట్లు పోలీసులు వెల్లడించారు.