మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 21 ఆగస్టు 2017 (10:51 IST)

మాజీ హాకీ ప్లేయరైన భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య.. ఎక్కడ?

ముంబైలో దారుణం జరిగింది. భార్యాభర్తల మధ్య జరిగిన చిన్న తగాదా చిలికిచిలికి గాలివానలా తయారైంది. ఫలితంగా హాకీ మాజీ ఆటగాడైన భర్తను భార్య కత్తితో పొడిచి చంపింది. ఈ దారుణం ముంబై శివారుల్లోని మలాద్‌లో జరిగిం

ముంబైలో దారుణం జరిగింది. భార్యాభర్తల మధ్య జరిగిన చిన్న తగాదా చిలికిచిలికి గాలివానలా తయారైంది. ఫలితంగా హాకీ మాజీ ఆటగాడైన భర్తను భార్య కత్తితో పొడిచి చంపింది. ఈ దారుణం ముంబై శివారుల్లోని మలాద్‌లో జరిగింది.  
 
ఈ వివరాలను పరిశీలిస్తే... 52 యేళ్ళ మాజీ హాకీ ఆటగాడు అయ్యప్ప చెనడా, ఈయన భార్య అమితలు మలాద్‌లో నివశిస్తున్నారు. అయితే, వీరిమధ్య మనస్పర్థలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి వీరిద్దరూ గొడవపడ్డారు. దీంతో ఆగ్రహించిన అమిత.. భర్తను కత్తితో పొడిచి చంపినట్టు ముంబై పోలీసులు వెల్లడించారు. 
 
అయితే హత్యకు గల కారణాలను పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదేసమయంలో భర్తను హత్య చేసిన భార్యను ఇంకా పోలీసులు అరెస్టు చేయలేదు. ఎందుకంటే.. భార్యాభర్తల మధ్య జరిగిన పెనుగులాటలో ఆమెకు కూడా గాయాలయ్యారు. దీంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు వెల్లడించారు.