మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 24 ఆగస్టు 2017 (15:06 IST)

సౌతాఫ్రికా క్రికెటర్ సంచలన నిర్ణయం .. వన్డే కెప్టెన్సీకి గుడ్ బై

సౌతాఫ్రికా క్రికెటర్ డీ విలియర్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత యేడాది టెస్ట్ కెప్టెన్సీని వదులుకున్న ఈయన ఇపుడు వన్డే జట్టు నాయకత్వ బాధ్యతల నుంచి కూడా తప్పుకున్నారు.

సౌతాఫ్రికా క్రికెటర్ డీ విలియర్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత యేడాది టెస్ట్ కెప్టెన్సీని వదులుకున్న ఈయన ఇపుడు వన్డే జట్టు నాయకత్వ బాధ్యతల నుంచి కూడా తప్పుకున్నారు. 
 
ఇటీవల జరిగిన చాంపియన్స్ ట్రోఫీతో పాటు, ఇంగ్లండ్ పర్యటనలో కూడా ఏబీ కెప్టెన్సీలోని సఫారీ జట్టు తీవ్రంగా నిరాశపరిచింది. దాంతో తన వన్డే కెప్టెన్సీకి సంబంధించి ఏబీ డివిలియర్స్ బుధవారం అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఇక వన్డే జట్టు పగ్గాలకు వీడ్కోలు చెబుతున్నట్లు ప్రకటించాడు.
 
తన కెరీర్‌కు సంబంధించి ఆగస్టు నెలలో ఓ నిర్ణయం తీసుకుంటానని ముందుగానే తెలిపిన ఏబీ.. ఆ మేరకు కెప్టెన్సీ బాధ్యత నుంచి తప్పుకున్నాడు. తన పదవికి రాజీనామా చేయడానికి ఇదే సరైన సమయమని పేర్కొన్న ఏబీ.. టెస్టుల్లో, టీ 20‌ల్లో కెప్టెన్‌గా మెరుగైన ఫలితాలు సాధించాడు.