ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 2 సెప్టెంబరు 2017 (16:09 IST)

మలింగా ఇంట్లో కోహ్లీ సేన... మందు పార్టీలో మునిగితేలిన క్రికెటర్లు?

భారత క్రికెట్ జట్టు శ్రీలంక పర్యటనలో ఉంది. టెస్ట్ సిరీస్‌తో పాటు.. వన్డే సిరీస్‌ను గెలుచుకుంది. అయితే, వన్డేల సిరీస్‌లో మరో మ్యాచ్ మిగిలివుంది. ఈ మ్యాచ్ ఆదివారం (సెప్టెంబరు 3వ తేదీ) జరగనుంది. ఈ నేపథ్య

భారత క్రికెట్ జట్టు శ్రీలంక పర్యటనలో ఉంది. టెస్ట్ సిరీస్‌తో పాటు.. వన్డే సిరీస్‌ను గెలుచుకుంది. అయితే, వన్డేల సిరీస్‌లో మరో మ్యాచ్ మిగిలివుంది. ఈ మ్యాచ్ ఆదివారం (సెప్టెంబరు 3వ తేదీ) జరగనుంది. ఈ నేపథ్యంలో భారత ఆటగాళ్ల కోసం శ్రీలంక ఆటగాడు లసిత్ మలింగా శుక్రవారం రాత్రి తన ఇంట్లో ప్రత్యేక విందు ఇచ్చాడు. ఐపీఎల్‌ ద్వారా మలింగాకి ముంబై ఇండియన్స్‌ జట్టు సారథి రోహిత్‌ శర్మతో ప్రత్యేక అనుబంధం ఉంది.
 
ఆగస్టు 31న జరిగిన నాలుగో వన్డేలో కోహ్లీ వికెట్‌ తీయడం ద్వారా మలింగా అంతర్జాతీయ వన్డే క్రికెట్లో 300 వికెట్లు తీసిన ఆటగాళ్ల క్లబ్‌లో చేరాడు. ఆ సమయంలో మైదానంలో ఉన్న రోహిత్‌.. మలింగాను హగ్‌ చేసుకుని అభినందించాడు. మలింగా ఇంట్లో విందులో పాల్గొన్న సమయంలో దిగిన ఫొటోలను శిఖర్‌ధావన్‌, రోహిత్‌ శర్మ సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకున్నారు. 
 
ఈ విందు కార్యక్రమంలో శ్రీలంక ఆటగాళ్లు పాల్గొన్నారు. ఐదు వన్డేల సిరీస్‌ని ఇప్పటికే 4-0తో భారత్‌ కైవసం చేసుకుంది. గతంలో వెస్టిండీస్‌ పర్యటనలోనూ మన ఆటగాళ్లు ఆ దేశపు ఆటగాళ్లు ఇచ్చిన విందు కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే.