గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : గురువారం, 31 ఆగస్టు 2017 (16:03 IST)

బాహుబలి టీవీ సిరీస్: జక్కన్న పేరును వాడుకుని రూ.25కోట్లు ఇస్తారట?

బాహుబలి సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించిన నేపథ్యంలో.. కొద్దిరోజుల్లోనే బాహుబలి రూపంలో టీవీ సిరీస్ రాబోతుంది. సెప్టెంబరులో చైనాలో బాహుబలి విడుదల కానుంది. చైనాలో దంగల్ రికార్డును బాహుబలి బ్రే

బాహుబలి సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించిన నేపథ్యంలో.. కొద్దిరోజుల్లోనే బాహుబలి రూపంలో టీవీ సిరీస్ రాబోతుంది. సెప్టెంబరులో చైనాలో బాహుబలి విడుదల కానుంది. చైనాలో దంగల్ రికార్డును బాహుబలి బ్రేక్ చేస్తుందా అనే దానిపై నెట్టింట్లో చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో బాహుబలి టీవీ సిరీస్ టీవీ ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకోనుందని సినీ పండితులు అప్పుడే జోస్యం చెప్పేస్తున్నారు. 
 
బాహుబలి టీవీ సిరీస్‌కు సంబంధించిన పనులు వేగవంతంగా సాగుతున్నాయని.. ఇందుకు సంబంధించి ఓ మల్టీనేషనల్ కంపెనీతో బాహుబలి మేకర్స్ చర్చలు జరుపుతున్నారని సమాచారం. అయితే దర్శకత్వ బాధ్యతలు చేపట్టకుండా రాజమౌళి పర్యవేక్షణకు మాత్రమే పరిమితం అవుతారని తెలుస్తోంది. ఐతే రాజమౌళి పేరును మాత్రం కంపెనీ వినియోగించుకుంటుందని సమాచారం. 
 
బాహుబలి పేరును ఉపయోగించుకునేందుకు ఈ టీవీ సిరీస్ మేకర్లు రూ.25కోట్ల రూపాయలు ఇవ్వనున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ చర్చలన్నీ కొలిక్కి వస్తే త్వరలోనే బాహుబలి సిరీస్ తెరకెక్కడం ఖాయమని టాలీవుడ్ వర్గాల టాక్.