మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : ఆదివారం, 13 ఆగస్టు 2017 (12:23 IST)

''సాహో'' డీల్ అదుర్స్.. ఆన్ లైన్ రైట్స్ రూ.50కోట్లు.. నెట్‌ఫ్లిక్స్ సొంతం..?

బాహుబలి సినిమాతో రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం ఆయన చేసే సినిమాలన్నీ అనేక భాషల్లో విడుదలవుతున్నాయి. ఇంకా వాణిజ్య ప్రకటనల్లో ప్రభాస్ కనిపిస్తున్నాడు. దీంతో ఆయన బ్రాండ్ విలువ

బాహుబలి సినిమాతో రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం ఆయన చేసే సినిమాలన్నీ అనేక భాషల్లో విడుదలవుతున్నాయి. ఇంకా వాణిజ్య ప్రకటనల్లో ప్రభాస్ కనిపిస్తున్నాడు. దీంతో ఆయన బ్రాండ్ విలువ కూడా పరుగులు తీస్తోంది. 
 
తాజాగా ప్రభాస్‌కు సంబంధించిన రూ.50కోట్ల డీల్ హాట్ న్యూస్‌గా మారింది. ప్రభాస్ తాజా సినిమా సాహో షూటింగ్ పూర్తి కాకుండానే ఆ సినిమా ఆన్‌లైన్ ప్రసారానికి సంబంధించిన హక్కుల్ని నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తం చెల్లించి.. సొంతం చేసుకుందని వార్తలొస్తున్నాయి. 
 
ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళం, మలయాళంలో నిర్మిస్తున్న నేపథ్యంలో రికార్డు స్థాయిలో 4 మిలియన్ యూఎస్ డాలర్లు పెట్టి నెట్ ఫ్లిక్స్ ఈ మూవీ ఆన్ లైన్ రైట్స్ సొంతం చేసుకుందనే వార్త ప్రభాస్ ఫ్యాన్స్‌ను పండగ చేసుకునేలా చేసింది. ఈ డీల్‌కు సంబంధించి త్వరలో ఒప్పందం కుదిరే అవకాశం ఉందని సమాచారం.