శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 11 ఆగస్టు 2017 (17:13 IST)

'నేనే రాజు నేనే మంత్రి' ఎలా ఉందంటే.. రాజమౌళి ట్వీట్

తేజ దర్శకత్వంలో రానా దగ్గుబాటి హీరోగా నటించి శుక్రవారం విడుదలైన చిత్రం "నేనే రాజు నేనే మంత్రి". ఈ చిత్రాన్ని ప్రేక్షకులతో పాటు.. దర్శక ధీరుడు ఎస్ఎస్.రాజమౌళి కూడా తొలిరోజు తొలి ఆటను చూసి తన అభిప్రాయాన్

తేజ దర్శకత్వంలో రానా దగ్గుబాటి హీరోగా నటించి శుక్రవారం విడుదలైన చిత్రం "నేనే రాజు నేనే మంత్రి". ఈ చిత్రాన్ని ప్రేక్షకులతో పాటు.. దర్శక ధీరుడు ఎస్ఎస్.రాజమౌళి కూడా తొలిరోజు తొలి ఆటను చూసి తన అభిప్రాయాన్ని సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నారు.
 
"నేనే రాజు నేనే మంత్రి సినిమాలో ప్రతిఒక్కరూ సూపర్బ్‌గా నటించారు. నా భల్లాలదేవుడిని చూసి గర్వపడుతున్నా. కాజల్‌తో పాటు కేథరిన్ కూడా బాగా చేసింది. నవదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. చాలా బాగా యాక్ట్ చేశాడు. ఓపెనింగ్‌లోనే ఉరిశిక్ష కోసం రానాను జైలుకు తీసుకెళ్లడం, క్లయిమాక్స్‌లో ఊహించని ట్విస్ట్ ఇవ్వడం.. ఈ రెండూ సినిమాలో బెస్ట్ పార్ట్స్. చాలా రోజుల తర్వాత అర్థవంతమైన సినిమా చూశా. చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు" అని రాజమౌళి పోస్ట్ చేశారు.