1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. Harbhajan Singh Trolled On Twitter, Cricketer Gives Befitting Reply

నువ్వు సిక్కువా అని ప్రశ్నించిన నెటిజన్.. కౌంటరిచ్చిన హర్భజన్ సింగ్

టీమిండియా స్టార్ బౌలర్ హర్భజన్ సింగ్ భార్య గీతా బాస్రాను ఉద్దేశించి సోషల్ మీడియాలో చేసిన పోస్టు వివాదానికి దారితీసింది. కర్వాచౌత్ సందర్భంగా భార్యకు భజ్జీకి శుభాకాంక్షలు తెలిపారు. బోలెడంత ప్రేమ, ముద్దు

Harbhajan Singh
టీమిండియా స్టార్ బౌలర్ హర్భజన్ సింగ్ భార్య గీతా బాస్రాను ఉద్దేశించి సోషల్ మీడియాలో చేసిన పోస్టు వివాదానికి దారితీసింది. కర్వాచౌత్ సందర్భంగా భార్యకు భజ్జీకి శుభాకాంక్షలు తెలిపారు. బోలెడంత ప్రేమ, ముద్దులు...బాగా ఆకలేస్తుంటుందని తెలుసు. ఇక తిను. ఏదైనా తాగు హ్యాపీగా వుండూ అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌పై పలువురు అభ్యంతరం చెప్పారు. 
 
నువ్వు సిక్కువేనా? అని ప్రశ్నించారు. కానీ సిక్కులు ఉపవాసం లాంటి అంధవిశ్వాసాన్ని నమ్మరన్నారు. ఇలాంటి ట్వీట్లు ఎక్కువ కావడంతో మరోసారి స్పందించిన భజ్జీ... ఇలా చెయ్యొద్దని ఏ గ్రంథంలో ఉంది? అని ప్రశ్నించాడు. ధర్మం పేరుతో అడ్డగోలు వాదనలు మాని, మంచి మనుషుల్లా ఉండండి అంటూ నెటిజన్లకు కౌంటరిచ్చాడు. కాగా 37 ఏళ్ల భజ్జీ ఇప్పటిదాకా 103 టెస్టు మ్యాచ్‌ల్లో 417 టెస్టు వికెట్లు సాధించాడు.
About Writer
selvi
తర్వాతి కథనం
ఆటవిడుపు... కోర్టులో ఫెదరర్ డాన్స్... (Video)