శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : గురువారం, 19 అక్టోబరు 2017 (16:24 IST)

అవకాశాల కోసం గ్లామర్ డోస్ పెంచేస్తోన్న సురభి

తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన కొత్త హీరోయిన్లల సురభి ఒకరు. 'బీరువా' సినిమాతో ఈమె ఫిల్మ్ నగర్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 'జెంటిల్‌మేన్', 'ఎక్స్‌ప్రెస్ రాజా' వంటి హిట్స్‌ను సొంతం చేసుకుంది. అయినా ఆ

తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన కొత్త హీరోయిన్లల సురభి ఒకరు. 'బీరువా' సినిమాతో ఈమె ఫిల్మ్ నగర్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 'జెంటిల్‌మేన్', 'ఎక్స్‌ప్రెస్ రాజా' వంటి హిట్స్‌ను సొంతం చేసుకుంది. అయినా ఆశించిన స్థాయిలో ఈ అమ్మాయికి అవకాశాలు రావడం లేదు.
 
ఇంతవరకూ గ్లామర్‌పరంగా ఆకట్టుకునే పాత్రలు చేయకపోవడమే అందుకు కారణమనే టాక్ వుంది. దాంతో ఆ తరహా పాత్ర కోసం సురభి కొంతకాలంగా వెయిట్ చేస్తోంది. రీసెంట్‌గా అల్లు శిరీష్ సినిమా నుంచి ఆ తరహా పాత్ర రావడం పట్ల ఆమె ఆనందాన్ని వ్యక్తం చేసినట్టు సమాచారం. 
 
ఈ పాత్రలో గ్లామర్ డోస్ పెంచేయడానికి ఆమె సిద్ధమవుతోందట. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా'తో హిట్ కొట్టిన వి.ఐ. ఆనంద్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. చక్కని కనుముక్కు తీరుతో ఇట్టే ఆకట్టుకునే సురభి, ఈ సినిమాతో యూత్‌ను కట్టిపడేయడం ఖాయమని చెప్పుకుంటున్నారు.