శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 17 అక్టోబరు 2017 (16:02 IST)

బూతు డైలాగుల వల్లే సినిమాలు వదులుకున్నా: టాప్ కమెడియన్

తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రకమెడియన్‌గా కొనసాగినవారిలో వేణుమాధవ్ ఒకరు. ఇటీవలి కాలంలో ఆయన సినిమాలకు దూరంగా ఉంటూ.... అధికార తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో తళుక్కున మెరుస్తున్నారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రకమెడియన్‌గా కొనసాగినవారిలో వేణుమాధవ్ ఒకరు. ఇటీవలి కాలంలో ఆయన సినిమాలకు దూరంగా ఉంటూ.... అధికార తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో తళుక్కున మెరుస్తున్నారు.
 
తాను సినిమాలకు దూరంగా ఉండటానికి గల కారణాలపై స్పందిస్తూ కొన్ని సినిమాలను తాను వదులుకున్నాననీ .. కొంతమంది తనని దూరంగా ఉంచారన్నారు. బూతు డైలాగులు ఎక్కువగా ఉండటం వలన కొన్ని సినిమాలను తాను వదులుకున్నాననీ, ఎందుకంటే ఆ తరహా సీన్స్‌ను తానే ఫ్యామిలీతో కలిసి చూసే పరిస్థితి లేదన్నారు. 
 
అలా నో చెప్పడం వల్ల ఆ తర్వాత తనని వాళ్లు దూరంగా ఉంచారన్నారు. ఇక ఈ మధ్యనే మళ్లీ అవకాశాలు పుంజుకుంటున్నాయనీ, ముందుగా స్క్రిప్ట్ చూశాకే ఓకే అంటున్నానని చెప్పుకొచ్చారు. త్వరలోనే మళ్లీ తనకు అవకాశాలు వస్తాయని వేణుమాధవ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.