గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 13 సెప్టెంబరు 2017 (17:08 IST)

రోజా అలా వుండేందుకు కారణం ఏమిటి? వేణు మాధవ్ వచ్చేస్తున్నాడా?

వైకాపా ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే, సినీనటి రోజా ఉలుకుపలుకు లేకుండా సైలెంట్‌గా వున్నారు. నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా అభ్యంతరకర పదజాలాన్ని వాడటమే కాకుండా, మంత్రి అఖిలప్రియ చుడీదార్లపై ఆమె చేసిన వ్యాఖ

వైకాపా ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే, సినీనటి రోజా ఉలుకుపలుకు లేకుండా సైలెంట్‌గా వున్నారు. నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా అభ్యంతరకర పదజాలాన్ని వాడటమే కాకుండా, మంత్రి అఖిలప్రియ చుడీదార్లపై ఆమె చేసిన వ్యాఖ్యలు వైసీపీకి ఓట్లను దూరం చేశాయనే భావన పార్టీ నేతల్లో ఉందని.. దీనికి తోడు వైకాపా హైకమాండ్ రోజాను కాస్త సైలెంట్‌గా వుండాల్సిందిగా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 
 
అంతేగాకుండా.. నిరంతరం అధికార పార్టీపైన, ముఖ్యమంత్రి చంద్రబాబుపైన విమర్శలతో చెలరేగిపోయే రోజా కొద్ది రోజులకు నోరు విప్పకపోవడమే మంచిదని హైకమాండ్ సూచించినట్లు తెలుస్తోంది. అందుకే నంద్యాల, కాకినాడ ఎన్నికల తర్వాత ఆమె మీడియా ముందుకు ఎక్కువగా రాలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లోవ్యతిరేక ఫలితాలు రావడానికి రోజా చేసిన వ్యాఖ్యలే కారణమని వైసీపీ హైకమాండ్ భావిస్తోందట. దీంతో రోజా తన నియోజకవర్గం నగరిపైనే ఫోకస్ పెట్టారట. అంతేగాకుండా పనిలో పనిగా వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటున్నారని సమాచారం.
 
మరోవైపు నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో రోజాను ఏకిపారేసిన కామెడీ నటుడు వేణుమాధవ్ ఇక పూర్తి స్థాయి రాజకీయాల్లో రానున్నట్లు సమాచారం. ఇందుకోసం ఏపీ సీఎం చంద్రబాబుతో ఆయన భేటీ కానున్నట్లు సమాచారం. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో సినీ ప్రముఖులను కూడా భాగం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇందులో భాగంగా వేణుమాధవ్‌ను బరిలోకి దించనున్నారు.
 
కాగా, నంద్యాల‌లో టీడీపీ త‌ర‌పున ప్ర‌చారం చేసిన వేణుమాధవ్ రోజాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నంద్యాలలో టీడీపీ తరపున ప్రచారం చేసిన వేణు మాధవ్‌ను "రోజాకు కౌంటర్ ఇచ్చేందుకే టీడీపీ మిమ్మల్ని ప్రచారంలోకి దింపిందని వార్తలు వస్తున్నాయి. నిజమేనా? అనే ప్రశ్నకు వేణుమాధవ్ బదులిస్తూ.. ఆమె ఎవరో తనకు తెలియదని, సారీ అని బదులిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రముఖ సినీనటి రోజాకు కౌంటరిచ్చేందుకు వేణు మాధవ్ రంగంలోకి దిగారని టాక్ వస్తోంది. చిట్టిపొట్టి డ్రెస్సులు వేసుకుని.. డ్యాన్సులు చేసే రోజానా అఖిల ప్రియ గురించి మాట్లాడేది అంటూ తీవ్రస్థాయిలో వేణు మాధవ్ ఫైర్ అయిన సంగతి తెలిసిందే.