సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 5 అక్టోబరు 2017 (14:00 IST)

వారిద్దరూ రాజకీయాల్లోకి రావాలంటున్న తమిళ కమెడియన్

తమిళ సినీ హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్‌లిద్దరూ రాజకీయాల్లోకి రావాలంటూ తమిళ హాస్య నటుడు వివేక్ అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి రావడం చాలా సులభమని, కానీ నిలదొక్కుకోవడమే కష్టమన

తమిళ సినీ హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్‌లిద్దరూ రాజకీయాల్లోకి రావాలంటూ తమిళ హాస్య నటుడు వివేక్ అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి రావడం చాలా సులభమని, కానీ నిలదొక్కుకోవడమే కష్టమన్నారు. 
 
చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, ప్రజాబలమే శక్తిమంతమైనదన్నారు. రాజకీయం అనేది ఒక సేవ అని, దాన్ని గ్రహించిన నేతలు గతంలో రాజకీయాల్లోకి వచ్చారన్నారు. తనకు రాజకీయాలు తెలియవన్నారు. కానీ, రాజకీయాల్లో లేకుండా సేవ చేయడం తెలుసన్నారు. ఇపుడు తాను అదే చేస్తున్నట్టు చెప్పారు.
 
తమిళ సూపర్‌స్టార్లు రజినీకాంత్‌, కమల్‌హాసన్‌లు రాజకీయాల్లోకి వచ్చినట్టయితే వారు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సేవ చేయాలని ప్రజల తరపున కోరుతున్నట్టు చెప్పారు. ప్రజలు కోరుకునే విధంగా పాలన అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.