మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 19 ఆగస్టు 2017 (12:55 IST)

'ఆ టీవీ చానల్.. పేపర్ ఎవరిదిరా బట్టేబాజ్'... జగన్‌పై వేణుమాధవ్ హాట్ కామెంట్స్

నంద్యాల ఉప ఎన్నికల ప్రచారం గడువు సమీపిస్తున్న కొద్దీ మాటలు తూటాలై పేలుతున్నాయి. ఒకవైపు జగన్, మరోవైపు చంద్రబాబులు ప్రచారం చేస్తుంటే.. మధ్యలో రోజా వంటి హీరోయిన్, వేణుమాధవ్ వంటి కమెడియన్లూ రంగ ప్రవేశం చే

నంద్యాల ఉప ఎన్నికల ప్రచారం గడువు సమీపిస్తున్న కొద్దీ మాటలు తూటాలై పేలుతున్నాయి. ఒకవైపు జగన్, మరోవైపు చంద్రబాబులు ప్రచారం చేస్తుంటే.. మధ్యలో రోజా వంటి హీరోయిన్, వేణుమాధవ్ వంటి కమెడియన్లూ రంగ ప్రవేశం చేస్తున్నారు. ఫలితంగా ప్రచారం మరింత రక్తి కట్టిస్తోంది. శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో సినీ నటుడు బాలకృష్ణను లక్ష్యంగా చేసుకుని రోజా విమర్శలు గుప్పించారు. వైకాపా ఎన్నికల గుర్తు ఫ్యాన్ గాలికి విగ్ ఎక్కడ ఎగిరిపోతుందోనన్న భయంతో బాలకృష్ణ పారిపోయాడంటూ విమర్శలు చేసింది. 
 
ఇపుడు కమెడియన్ వేణుమాధవ్ వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని మాటల తూటాలు పేల్చాడు. ఒకడేమో నాకు చానల్ లేదు, పేపర్ లేదని అంటున్నాడని... మరి ఆ చానల్ ఎవరిది, పేపర్ ఎవరిదిరా బట్టేబాజ్ అంటూ తీవ్ర పదజాలంతో ప్రశ్నించాడు. తాను ఎవరినీ విమర్శించనని, విమర్శించే అలవాటు తనకు లేదని చెప్పడం కొసమెరుపు. 
 
నంద్యాల ఉప ఎన్నికల్లో ఓటమి వైకాపా నేతలను పట్టిపీడిస్తోందన్నారు. అందుకే ఆ పార్టీ నేతలు ఎన్నికల గుర్తును చేతపట్టుకుని తిరుగుతున్నారని... మన గుర్తు మాత్రం మన గుండెల్లోనే ఉందన్నారు. నిజానికి నంద్యాల ప్రచారానికి చంద్రబాబుని రావొద్దని తాను కోరానని... ఇక్కడ గెలుపు ఖాయమని, మీరు అక్కడే కూర్చుని టీవీల్లో చూడమని చెప్పినట్టు వెల్లడించారు. 
 
ఇకపోతే.. "నా బిడ్డలైన భూమా అఖిలప్రియ, భూమా బ్రహ్మానందరెడ్డిల గురించి విమర్శించిన వారి గురించి నేను మాట్లాడటమా... థూ... నీచం, నికృష్టం" అని అన్నాడు. కర్నూలు నుంచి నంద్యాలకు ఒక గంటలో వచ్చేస్తానని అనుకున్నానని కానీ చాలా సమయం పట్టిందని... అన్ని చోట్లా అభివృద్ధి కార్యక్రమాలే జరుగుతున్నాయని... ఎక్కడ చూసినా ప్రొక్లైనర్లే కనిపిస్తున్నాయని వేణుమాధవ్ అన్నారు.