మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 22 అక్టోబరు 2017 (11:51 IST)

హీరో కార్తీ, రకుల్ జోడీగా ఖాఖీ- ట్రైలర్ చూడండి.. (వీడియో)

హీరో కార్తీ, టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ''ఖాకీ'' త్వరలో రిలీజ్ కానుంది. ఈ సినిమా సంబంధించి రెండు నిమిషాల నిడివిగల ట్రైలర్‌ని యూనిట్ రిలీజ్ చేసింది. 12 ఏళ్ల కిందట ఓ పత్రికలో వచ్చిన వాస్తవ

హీరో కార్తీ, టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ''ఖాకీ'' త్వరలో రిలీజ్ కానుంది. ఈ సినిమా సంబంధించి రెండు నిమిషాల నిడివిగల ట్రైలర్‌ని యూనిట్ రిలీజ్ చేసింది. 12 ఏళ్ల కిందట ఓ పత్రికలో వచ్చిన వాస్తవ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఓ సిన్సియర్ పోలీసు ఆఫీసర్‌గా కార్తీ కనిపిస్తున్నాడు. ఈ ట్రైలర్లో పవర్‌లో ఉన్నోడి ప్రాణానికి ఇచ్చే విలువ.. పబ్లిక్ ప్రాణానికి ఎందుకు ఇవ్వరని కార్తీ ప్రశ్నించే డైలాగ్ అదిరింది. 
 
పోలీసోళ్లు వత్తారు.. చూత్తారు.. పోతారు.. ఈ జనాన్ని కాపాడేదెవరు? 25 ఏళ్లుగా ఇన్‌పార్మర్‌గా ఉంటున్నా సర్. ఇంతవరకూ ఇలాంటిది ఎప్పుడూ చూడలేదన్న డైలాగ్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ఇక కార్తి ఛేజింగ్‌ సన్నివేశాలు చూస్తే పక్కా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. ఈ ట్రైలర్‌ను ఓ లుక్కేయండి..