గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr

పవన్ నటనంటే నాకు చాలా ఇష్టం : భానుప్రియ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటన అంటే తనకు చాలా ఇష్టమని సీనియర్ నటి భానుప్రియ అంటోంది. తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక అంశాలపై తన మనసులోని మాటను వెల్లడించారు. పవన్ గొప్పనటుడంటూ ఆమె ప్రశంసించారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటన అంటే తనకు చాలా ఇష్టమని సీనియర్ నటి భానుప్రియ అంటోంది. తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక అంశాలపై తన మనసులోని మాటను వెల్లడించారు. పవన్ గొప్పనటుడంటూ ఆమె ప్రశంసించారు. 
 
పవన్ నటన .. ఆయన ఎమోషన్స్‌ను పండించే తీరు .. డైలాగ్స్ చెప్పే విధానం చాలా బాగుంటాయన్నారు. ఆయన సినిమాలను తాను తప్పకుండా చూస్తుంటాననీ.. వాటిలో తనకి 'అత్తారింటికి దారేది' చాలా ఇష్టమన్నారు. ఆ సినిమాలో ఆయన నటన తనని ఎంతగానో ఆకట్టుకుందన్నారు. అవకాశం వస్తే ఆయన సినిమాలో చేయడానికి తాను సిద్ధంగా వున్నానని అన్నారు. 
 
ఇకపోతే.. ఇప్పటి దర్శకులలో ఎవరి సినిమాలలో నటించడానికి ఆసక్తిని చూపుతారు? అనే ప్రశ్నకి భానుప్రియ తనదైన శైలిలో స్పందించారు. 'బాహుబలి' సినిమా చూసిన తర్వాత మళ్లీ రాజమౌళి దర్శకత్వంలో నటించాలనిపించిందన్నారు.
 
గతంలో ఆమె రాజమౌళి తెరకెక్కించిన 'ఛత్రపతి'లో నటించిన సంగతి తెలిసిందే. అలాగే పూరీ జగన్నాథ్ .. త్రివిక్రమ్ .. సుకుమార్ .. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేయాలనుందని చెప్పారు. అవకాశం వస్తే మాత్రం వదులుకోనని తేల్చి చెప్పారు.