మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: సోమవారం, 16 అక్టోబరు 2017 (17:29 IST)

అర్జున్ రెడ్డి దర్శకుడితో పవన్ కళ్యాణ్‌ సినిమా చేయాల్సిందేనట...

అర్జున్ రెడ్డి. తెలుగు సినీ పరిశ్రమలో ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతాఇంతా కాదు. తీసింది తక్కువ బడ్జెట్ సినిమానే అయినా భారీ హిట్‌తో దూసుకెళ్ళింది ఈ సినిమా. సినిమాలో నటించిన విజయ్ దేవరకొండ, షాలిని పాండేలకు మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది. హీరోహీరోయిన

అర్జున్ రెడ్డి. తెలుగు సినీ పరిశ్రమలో ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతాఇంతా కాదు. తీసింది తక్కువ బడ్జెట్ సినిమానే అయినా భారీ హిట్‌తో దూసుకెళ్ళింది ఈ సినిమా. సినిమాలో నటించిన విజయ్ దేవరకొండ, షాలిని పాండేలకు మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది. హీరోహీరోయిన్లే కాదు డైరెక్టర్ సందీప్ రెడ్డికి గుర్తింపు ఒక్కసారిగా పెరిగిపోయింది. అప్పటివరకు సందీప్ అంటే పెద్దగా ఎవరికీ తెలియదు. అస్సలు తెలుగు సినీ పరిశ్రమ వారికే తెలియదు. అలాంటిది అర్జున్ రెడ్డి సినిమాతో సందీప్‌కు తిరుగులేని డైరెక్టర్ అన్న మంచి పేరు వచ్చింది.
 
టాప్ డైరెక్టర్ జాబితాలో సందీప్ రెడ్డి చేరిపోయాడు. ఈ సినిమా టాప్ హీరో, హీరోయిన్లకు బాగా నచ్చింది. అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ కు ఇంకా బాగా నచ్చింది. అందుకే పవన్ కళ్యాణ్‌ సందీప్ రెడ్డితో సినిమా చేయాలన్న ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం పవన్, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఆ తరువాత జనసేన పార్టీలో చురుగ్గా పాల్గొనాలని నిర్ణయానికి వచ్చారు. కానీ కొద్దిగా గ్యాప్ ఇచ్చి సందీప్‌తో సినిమా చేసి తీరుతారనీ, ఆ తరువాతనే జనసేనపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న నిర్ణయానికి వచ్చాడట పవన్ కళ్యాణ్‌. 
 
ఐతే పవన్ ఇక ఇప్పుడప్పుడే సినిమాలు చేసే అవకాశం లేదని మరో వర్గం వాదిస్తోంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం గతంలోనే ఓ మాట చెప్పారు. తన వద్ద డబ్బులు లేవనీ, తన వృత్తి సినిమాల్లో నటించడమే కాబట్టి నటించక తప్పదని వెల్లడించాడు. అంతెందుకు... గతంలో ముఖ్యమంత్రి అయిన ఎన్టీఆర్, గ్యాప్ లో సినిమాల్లో నటించారు కూడా. కాబట్టి పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించడం మానుకుంటారని చెప్పలేం.