ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 15 అక్టోబరు 2017 (14:17 IST)

''హిరణ్యకశిప''గా రానా.. గుణశేఖర్, సురేష్ బాబు చర్చలు..

రుద్రమదేవితో పౌరాణిక చిత్రాన్ని తెరకెక్కించిన గుణశేఖర్.. తదుపరి సినిమాపై దృష్టి సారించారు. ఒక్కడు, చూడాలని వుంది, వంటి బ్లాక్ బస్టర్ హిట్స్‌ను అందించిన గుణశేఖర్, బాలల రామాయణంతో పౌరాణికాలను రుద్రమదేవిత

రుద్రమదేవితో పౌరాణిక చిత్రాన్ని తెరకెక్కించిన గుణశేఖర్.. తదుపరి సినిమాపై దృష్టి సారించారు. ఒక్కడు, చూడాలని వుంది, వంటి బ్లాక్ బస్టర్ హిట్స్‌ను అందించిన గుణశేఖర్, బాలల రామాయణంతో పౌరాణికాలను రుద్రమదేవితో చారిత్రకాలను అద్భుతంగా తెరకెక్కించగలనని నిరూపించాడు. త్వరలో ఆయన ''హిరణ్యకశిప'' అనే మరో పౌరాణికానికి శ్రీకారం చుట్టనున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. 
 
హిరణ్యకశిప పాత్ర కోసం గుణశేఖర్ బాహుబలి భల్లాలదేవుడు రానాను ఎంపిక చేసుకున్నాడనే ప్రచారం సాగుతోంది. అయితే అసలు ఈ పాత్రలో కనిపించేందుకు రానా కూడా ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ మంచి క్రేజ్ సంపాదించుకుంటున్న రానా.. ఈ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పేసినట్లు తెలుస్తోంది. దాంతో తమ బ్యానర్లో ఆ సినిమాను తెరకెక్కించాలని సురేశ్ బాబు నిర్ణయించుకున్నట్టు సమాచారం.