సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 14 నవంబరు 2017 (12:03 IST)

పవన్ దేవుడా.. ఫ్యాన్స్ ఓవరాక్షన్‌పై స్పందిస్తే అప్పుడు నమ్ముతా: మహేష్ కత్తి

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయన ఫ్యాన్స్ నుంచి బెదిరింపులు, ఫోన్స్ కాల్స్‌తో ఇబ్బందులు ఎదుర్కొన్న సినీవిశ్లేష‌కుడు మ‌హేశ్ క‌త్తి మళ్లీ పవన్‌పై విరుచుకుపడ్డారు. పవన్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయన ఫ్యాన్స్ నుంచి బెదిరింపులు, ఫోన్స్ కాల్స్‌తో ఇబ్బందులు ఎదుర్కొన్న సినీవిశ్లేష‌కుడు మ‌హేశ్ క‌త్తి మళ్లీ పవన్‌పై విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్‌ని కొందరు దేవుడని అంటున్నారని.. అయితే పవర్ స్టార్ తన అభిమానులు చేసే ఓవ‌ర్ యాక్ష‌న్ గురించి తెలిసే.. నోరు విప్పకపోవడం ఏమిటని ప్రశ్నించారు.
 
ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని కొంద‌రు దేవుడని అంటున్నార‌ని, ఆయ‌న దేవుడా? అని మ‌హేశ్ క‌త్తి ప్ర‌శ్నించారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒకవేళ తన ఫ్యాన్స్ చేష్టలపై స్పందిస్తే తాను పవన్‌కు దాసోహం అయిపోతానని సవాల్ విసిరారు. అంతేకాదు.. ఫ్యాన్స్‌ దురుసుతనం, దూకుడుకు పవన్ కళ్లెం వేయగలిగితే.. జనసేనలో చేరుతానని మహేష్ కత్తి స్పష్టం చేశారు. 
 
ప‌వ‌న్ కల్యాణ్ త‌న‌కు మ‌ద్ద‌తుగా స్పందించాల‌ని తాను అన‌డం లేద‌ని, ప‌వ‌న్ ఎలా స్పందించినా తనకు ఓకేనన్నారు. ఫ్యాన్స్ ఆయన్ని దేవుడంటుంటే.. ఆయన ఎంతటి దేవుడో తానూ చూస్తానని కత్తి సవాల్ విసిరారు. పవన్ స్పందిస్తే.. ఆయన కోసం కొమ్ముకాస్తానని.. పార్టీ కోసం పనిచేస్తానని మహేష్ కత్తి వ్యాఖ్యానించారు. కత్తి మహేష్ కామెంట్లతో ఫ్యాన్స్ పవన్ స్పందిస్తారా లేదా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.