సంబంధిత వార్తలు
- పవన్‌కు పురస్కారం.. లండన్‌కి ప్రయాణం..
- నాకు పవన్ డబ్బులిచ్చారా? రెండో పెళ్లి చేస్కోకుండానే చచ్చిపోతానేమో? రేణు దేశాయ్
- 2019 ఎన్నికల్లో అనంతపురం నుంచి పవన్ పోటీ: మహేందర్ రెడ్డి
- #PSPK25 : ఓవర్‌నైట్‌లో మిలియన్ వ్యూస్ సొంతం (Audio Song)
- సీనియర్ నరేష్ సంచలనం... పవన్ వస్తే ఎన్టీఆర్ పాలనే, కమల్ హాసన్ అయితే...
ఆత్మకు శాంతి చేకూరాలని చెపితే సరిపోతుందా? జరిగిన నష్టం పూడ్చలేనిది : పవన్
కృష్ణానదిలో జరిగిన బోటు ప్రమాదంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. 'మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా'... లాంటి మాటలను చెప్పడం ద్వారా మృతుల కుటుంబాలక
కృష్ణానదిలో జరిగిన బోటు ప్రమాదంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. 'మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా'... లాంటి మాటలను చెప్పడం ద్వారా మృతుల కుటుంబాలకు జరిగిన నష్టాన్ని పూడ్చలేమని అన్నారు.ఈ మేరకు జనసేన పార్టీ సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేసింది.
ప్రస్తుతం తన కొత్త చిత్రం షూటింగ్ నిమిత్తం పవన్ కళ్యాణ్ విదేశాల్లో ఉన్న విషయం తెల్సిందే. ఈ ప్రమాద వార్తను ఓ మీడియా ద్వారా తెలుసుకుని ప్రకటన చేశారు. చిన్నచిన్న నిర్లక్ష్యాలకు ఎంతో విలువైన ఇన్ని ప్రాణాలు కోల్పోవడం తనను ఎంతో కలచి వేసిందన్నారు.
ప్రజల ప్రాణాలకు సంబంధించి ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ రంగంలోని వారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని ఈ ప్రమాదం మరోసారి గుర్తు చేసిందన్నారు. ఇంకోసారి ఇలాంటి సానుభూతి ప్రకటన చేయాల్సిన పరిస్థితి, అవసరం రాకుండా ఉండే పరిస్థితులను కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు పవన్ పేర్కొన్నారు.
