శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: సోమవారం, 13 నవంబరు 2017 (14:36 IST)

క్రిష్ణానది ప్రమాదంపై కన్నీరు పెట్టుకున్న సిఎం బాబు, విలపించిన నారాయణ

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు క్రిష్ణానది వద్ద జరిగిన పడవ బోల్తా ప్రాంతానికి చేరుకున్నారు. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై పర్యాటక శాఖ అధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. రివర్ బోటింగ్ అడ్వంచర్ సంస్థకు అనుమతి లే

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు క్రిష్ణానది వద్ద జరిగిన పడవ బోల్తా ప్రాంతానికి చేరుకున్నారు. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై పర్యాటక శాఖ అధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. రివర్ బోటింగ్ అడ్వంచర్ సంస్థకు అనుమతి లేకపోయినా పడవను నడుపుకునేందుకు ఎవరు అనుమతి ఇచ్చారని పర్యాటక శాఖ అధికారులను ప్రశ్నించారు.
 
పర్యాటక శాఖ అధికారులు ఎవరైనా ఆ ప్రైవేటు సంస్థకు సహకరించారేమో విచారణ చేసి, ఒకవేళ అలాంటిదే జరిగితే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు ముఖ్యమంత్రి. గల్లంతైన 9 మంది ఆచూకీ కోసం బంధువులు పడుతున్న ఆర్తనాదాలను చూసి బాబు చలించిపోయారు. కళ్ళ వెంట కన్నీరు పెట్టుకున్నారు. మృతుల కుటుంబ సభ్యులను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి. 
 
బోరున విలపించిన సిపిఐ నారాయణ 
క్రిష్ణానది పడవ బోల్తా ప్రమాదంపై సిపిఐ జాతీయ నేత నారాయణ కన్నీటి పర్యంతమయ్యారు. తమ బంధువుల ఆ ప్రమాదంలో మరణించడంతో ఆయన తీవ్ర ఆవేదనకు గురయ్యారు. పడవ ప్రమాదంలో బావమరిది పాపారావు భార్య లలిత మరణించడంతో పాటు పాపారావు కోడలు హరిత, మనవరాలు అశ్వికల మృతదేహాలు కనిపించకుండా పోయాయి. దీంతో నారాయణ కుటుంబం మొత్తం విషాదంలోకి వెళ్ళిపోయింది. 
 
జరిగిన సంఘటనపై తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేసిన నారాయణ, గల్లంతైన మృతదేహాలను త్వరగా ప్రభుత్వం బంధువులకు అప్పజెప్పాలని కోరారు. అలాగే రివర్ బోటింగ్ అడ్వంచర్ సంస్థపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నారాయణ.