మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 7 నవంబరు 2017 (20:18 IST)

సీనియర్ నరేష్ సంచలనం... పవన్ వస్తే ఎన్టీఆర్ పాలనే, కమల్ హాసన్ అయితే...

సీనియర్ నరేష్ సంచలన ట్వీట్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఇక పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలైతే ఆయన ట్వీట్లకు రీట్వీట్లు ఇస్తూ గత 20 గంటలుగా పొగడ్తల జల్లు కురిపిస్తున్నారు. ఇంతకీ సీనియర్ నరేష్ తన ట్విట్టర్లో ఏమన్నారయా అంటే... ఆంధ్రప్ర

సీనియర్ నరేష్ సంచలన ట్వీట్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఇక పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలైతే ఆయన ట్వీట్లకు రీట్వీట్లు ఇస్తూ గత 20 గంటలుగా పొగడ్తల జల్లు కురిపిస్తున్నారు. ఇంతకీ సీనియర్ నరేష్ తన ట్విట్టర్లో ఏమన్నారయా అంటే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్, తమిళనాడు రాష్ట్రానికి కమల్ హాసన్ ముఖ్యమంత్రులు కావాలని లక్షలాది మంది అభిమానులు, ప్రజలు కలలుగంటున్నారని ట్విట్టర్లో పేర్కొన్నారు. 
 
అంతటితో ఆగకుండా పవన్ కళ్యాణ్ కనుక ముఖ్యమంత్రి అయితే ఇక స్వర్గీయ నందమూరి తారక రామారావు పాలన వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే కమల్ హాసన్ కనుక తమిళనాడులో ముఖ్యమంత్రి అయితే ఎంజీఆర్ పాలన వస్తుందని తెలిపారు. నరేష్ ట్వీట్లతో చాలామంది పాజిటివ్‌గా రెస్పాండ్ అవుతున్నారు. 
 
తన పోస్ట్ చేసిన ట్వీట్‌తో పాటుగా కమల్ హాసన్‌తో తను దిగిన ఫోటోను, కింద పవన్ కళ్యాణ్ ఫోటోను జోడించారు. కాగా ఈరోజు కమల్ హాసన్ సరైన సమయంలో తన పార్టీ ప్రకటన చేస్తానని తెలిపారు. పవన్ కళ్యాణ్ మాత్రం జనసేన పార్టీ కార్యకలాపాల్లో బిజీగా వున్నారు.