గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 7 నవంబరు 2017 (12:18 IST)

బైటికొచ్చి చూస్తే టైమేమో త్రీ ఓ క్లాక్.. త్రివిక్రమ్-పవన్ సినిమా తొలి సాంగ్ (వీడియో)

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌ క‌ళ్యాణ్‌, దర్శకుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో హారిక‌హాసినీ క్రియేష‌న్స్ బేనర్లో తాజాగా తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం బల్గేరియాలో జరుగుతోంది. ఇంకా టైటిల్ ఖర

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌ క‌ళ్యాణ్‌, దర్శకుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో హారిక‌హాసినీ క్రియేష‌న్స్ బేనర్లో తాజాగా తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం బల్గేరియాలో జరుగుతోంది. ఇంకా టైటిల్ ఖరారుకాని ఈ చిత్రానికి సంబంధించిన పాటల చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమా తొలి పాటను సోషల్ మీడియాలో సినీ యూనిట్ విడుదల చేసింది. దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా పాట లిరికల్‌ వీడియోను విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు పేర్కొన్నారు.
 
'బైటికొచ్చి చూస్తే టైమేమో త్రీ ఓ క్లాక్' అంటూ సాగుతున్న పాట లిరిక్స్ క్యాచీగా ఉన్నాయి. ప్రస్తుతం 'ఆజ్ఞాతవాసి' అన్న టైటిల్ ను చిత్రం కోసం పరిశీలిస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఇటీవలే బల్గేరియా సెట్స్‌లో షూటింగుకు సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్, అనూ ఇమ్మానుయేల్ మీద డ్యూయెట్ సాంగ్ ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. వచ్చే సంవత్సరం జనవరిలో సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన తొలి సాంగ్ మీ కోసం..