సంబంధిత వార్తలు
- ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించకుంటే సూసైడ్ చేసుకుంటా : కేఆర్కే
- చిన్నమ్మ, మామలు చేసే పాడు పని చూడలేక చనిపోతున్నా...
- బ్లూ వేల్ నిషేధంపై 3వారాల్లోపు నివేదిక సమర్పించాలి.. ఇదో జాతీయ సమస్య: సుప్రీం
- అమ్మాయిలకేమైంది : ఓ విద్యార్ధిని ఆత్మహత్య.. మరో ఐటీ ఉద్యోగిని మిస్సింగ్
- ఇలియానా 'బెటర్ హాఫ్' అని ట్వీట్ చేసింది.. నీబోస్‌తో పెళ్లైపోయినట్టేనా?
సూసైడ్ చేసుకోవాలని భావించిన గోవా బ్యూటీ
గోవా బ్యూటీ ఇలియానా. స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయం చేసిన హీరోయిన్. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో వచ్చిన అనేక చిత్రాల్లో ఈ గోవా బ్యూటీ నటించి మంచి గుర్తింపు పొందడమేకాకుండా, తెల
గోవా బ్యూటీ ఇలియానా. స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయం చేసిన హీరోయిన్. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో వచ్చిన అనేక చిత్రాల్లో ఈ గోవా బ్యూటీ నటించి మంచి గుర్తింపు పొందడమేకాకుండా, తెలుగు స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. కాలక్రమంలో ఈ అమ్మడికి అవకాశాలు లేకపోవడంతో తన ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేస్తోంది. పైగా, అపుడపుడూ ఈతకొలనులో ఉంటూ అదిరిపోయే ఫోటోలను తీయించి, తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తూ తానున్నట్టు సినీ అభిమానులకు గుర్తుచేస్తుంది.
అయితే, ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ మెంటల్ హెల్త్ అనే కార్యక్రమానికి ఈ భామ హాజరైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తన జీవితంలో ఎదుర్కొన్న ఒత్తిళ్ల గురించి వివరించింది. తన శరీరం గురించి పలువురు పలు రకాల కామెంట్స్ చేసినప్పుడు తాను చాలా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిందట. ఒకానొక టైంలో సూసైడ్ కూడా చేసుకోవాలని భావించిందట. కానీ అంతలోనే తనకి తానే ధైర్యం చెప్పుకొని నార్మల్ స్టేజ్‌కి వచ్చానని చెబుతోంది ఇలియనా.
డిప్రెషన్ నుండి బయటపడాలంటే ముందుగా మనకు మనం ధైర్యం తెచ్చుకోవాలని అంటుంది గోవా బ్యూటీ. డిప్రెషన్‌లోకి వెళ్లినప్పుడు వెంటనే వైద్యులని సంప్రదించాలి లేదంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని తన అనుభవాన్ని వెల్లడించింది. నటీమణులు అందంగా కనిపించడానికి రెండు గంటల సమయం పడుతుంది, కానీ మనసు ప్రశాంతంగా ఉంటే ఎలాంటి మేకప్‌లు లేకుండా చాలా గ్లామర్‌గా కనిపిస్తారని ఈ సన్నజాజితీగనడుం చిన్నది చెపుతోంది.
