1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. KRK aka Kamaal Rashid Khan threatens to commit suicide

ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించకుంటే సూసైడ్ చేసుకుంటా : కేఆర్కే

ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించకుంటే ఆత్మహత్య చేసుకుంటానని ప్రముఖ సినీ విశ్లేషకుడు కమాల్ రషీద్ ఖాన్ అలియాస్ కేఆర్కే హెచ్చరించాడు. భారతదేశంలో సినిమాలు విడుదలకాకముందే విదేశాల్లో వేసే ప్రీమియర్ షోలను తిలకి

KRK
ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించకుంటే ఆత్మహత్య చేసుకుంటానని ప్రముఖ సినీ విశ్లేషకుడు కమాల్ రషీద్ ఖాన్ అలియాస్ కేఆర్కే హెచ్చరించాడు. భారతదేశంలో సినిమాలు విడుదలకాకముందే విదేశాల్లో వేసే ప్రీమియర్ షోలను తిలకించి తనదైనశైలిలో రివ్యూలు రాయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఈ రివ్యూలను సోషల్ నెట్‌వర్క్ సైట్లలో పోస్ట్ చేస్తూ విస్తృత ప్రచారం కల్పిస్తుంటాడు. 
 
అలాంటి కేఆర్కే ఇపుడు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నాడు. ఈ మేరకు మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన, "ట్విట్టర్ ఇండియా ప్రధాన ఉద్యోగులైన మహిమా కౌల్, విరల్ జాని, తరంజిత్ సిగ్తోలను నేను ఒకటే కోరుకుంటున్నాను. 15 రోజుల్లోగా నా ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించండి. 
 
మీరు నా ఖాతాను సర్పెండ్ చేశారు. నా దగ్గర డబ్బు తీసుకుని నన్ను మోసం చేశారు. వెంటనే నా ఖాతాను తిరిగి పునరుద్ధరించుకంటే నేను ఆత్మహత్య చేసుకుంటారు. నా చావుకు కారణం మాత్రం మీరే" అంటూ వ్యాఖ్యానించాడు. కాగా, అక్టోబర్ 18న కేఆర్కే ట్విట్టర్ ఖాతాను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
''టబు''ను తీసుకుందామన్న త్రివిక్రమ్.. వద్దన్న ఎన్టీఆర్..?