1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Actor Upendra Comments on Pawan Kalyan

ఆ విషయంలో నేను పవన్ కళ్యాణ్ కాలేనంటున్న కన్నడ నటుడు...

కన్నడతో పాటు తెలుగు సినిమాల్లో నటించి విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఉపేంద్ర. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన ఉపేంద్ర కన్నడ విజ్ఞావంత జనతాపార్టీ పేరుతో సొంత పార్టీనే పెట్టేశారు. కన్నడ, తెలుగు, తమిళ సినిమాల్లో విభిన్నమైన పాత్రలో నటించారు ఉపేంద్

Actor Upendra
కన్నడతో పాటు తెలుగు సినిమాల్లో నటించి విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఉపేంద్ర. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన ఉపేంద్ర కన్నడ విజ్ఞావంత జనతాపార్టీ పేరుతో సొంత పార్టీనే పెట్టేశారు. కన్నడ, తెలుగు, తమిళ సినిమాల్లో విభిన్నమైన పాత్రలో నటించారు ఉపేంద్ర. కన్నడ భాషలో అటు చిరు, ఇటు పవన్ కళ్యాణ్‌ ఇద్దరికి అభిమానులు చాలామందే ఉన్నారు.
 
చిరు కన్నా పవన్ అంటే కన్నడిగులుకు చాలా ఇష్టం. ఆయన నటనంటే పిచ్చిపిచ్చిగా ఇష్టపడతారు. పవన్ రాజకీయ అరంగేట్రం గురించి కూడా కన్నడిగులు బాగా ఫాలో అవుతున్నారు. నా రాజకీయ స్ఫూర్తి పవన్ కళ్యాణ్ అని చెప్పాడు ఉపేంద్ర. తన పార్టీలో చేరాలనుకునేవారికి డబ్బు అవసరం లేదు. 
 
ప్రజా సేవ చేసేవారు మాత్రమే చాలు. నేను ఎంజిఆర్, ఎన్‌టిఆర్, చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ లాగా కాలేను. ఉపేంద్ర లాగానే ఉంటానని చెప్పాడు. పవన్ కళ్యాణ్‌ పైన అలా మాట్లాడటంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
About Writer
TJ
తర్వాతి కథనం
పెళ్లి చూద్దామని వెళ్లిన అమ్మాయి మెడలో తాళి కట్టిన వరుడు...