శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 3 నవంబరు 2017 (14:06 IST)

తల్లిపై ప్రతీకారం తీర్చుకుంటానంటున్న రాంగోపాల్ వర్మ

తనను తన తల్లి చాలా తక్కువగా అంచనా వేశారని, త్వరలోనే ఆమెపై ప్రతీకారం తీర్చుకుంటానని వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్నారు. ఈ మేరకు ఆయన ఫేస్‌బుక్‌లో ఓ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

తనను తన తల్లి చాలా తక్కువగా అంచనా వేశారని, త్వరలోనే ఆమెపై ప్రతీకారం తీర్చుకుంటానని వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్నారు. ఈ మేరకు ఆయన ఫేస్‌బుక్‌లో ఓ ఆసక్తికర కామెంట్స్ చేశారు. 
 
ఇదే అంశంపై ఆయన ఫేస్‌బుక్‌లో చేసిన కామెంట్స్‌ను పరిశీలిస్తే, "తన తల్లి తనను చాలా తక్కువగా అంచనా వేశారని... తాను ఎందుకూ పనికిరానని భావించేవారని చెప్పారు. అందుకే నాగార్జునతో తీయబోతున్న కొత్త సినిమాకు ఆమె చేత క్లాప్ కొట్టిస్తానని... దీంతో, తన తల్లిపై తన ప్రతీకారం పూర్తవుతుందని" ఆయన అన్నారు. ఈ సందర్భంగా చిన్నపుడు తన అమ్మతో కలసి దిగిన ఫొటోను ఆర్జీవీ ముఖపుస్తకంలో అప్‌లోడ్ చేశారు. 
 
అయితే ఈ సినిమా గతంలో వచ్చిన 'శివ'కు సీక్వెల్‌గా ఉంటుందని వార్తలు వచ్చాయి. ఈ వార్తలను హీరో నాగార్జున ఖండించారు. పైగా ఈ ప్రచారం అసత్యమని చెప్పారు. దీనిపై ఆర్జీవీ స్పందించారు. ఈ నెల 20వ తేదీన నాగార్జునతో కొత్త సినిమాను ప్రారంభిస్తున్నట్టు వర్మ చెప్పారు. గతంలో వచ్చిన శివకు ఇపుడు తాను తీయబోయే చిత్రానికి ఎలాంటి పోలిక లేదని రాంగోపాల్ వర్మ చెప్పారు.