మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 11 నవంబరు 2017 (09:43 IST)

జగన్ శ్రీవారి దర్శనంపై పాస్టర్ల ఫైర్.. వైఎస్సార్ కూడా విగ్రహారాధన చేయడంతోనే?

క్రైస్తవుడైన వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి పూజించడంపై కొందరు పాస్టర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విగ్రహారాధన చేసిన జగన్‌‌ని కచ్చితంగా శిక్షిస్తాడని తిరుపతికి చెందిన పాస్ట

క్రైస్తవుడైన వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి పూజించడంపై కొందరు పాస్టర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విగ్రహారాధన చేసిన జగన్‌‌ని కచ్చితంగా శిక్షిస్తాడని తిరుపతికి చెందిన పాస్టర్ డేవిడ్ కరుణాకరన్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ వీడియో వైరల్ అయ్యింది

డేవిడ్ కరుణాకరన్ మాట్లాడుతూ.. కొండ  మీదకు వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత జగన్ ఏమన్నారంటే.. పాదయాత్ర ప్రారంభించేందుకు ముందు ఆయన ఆశీర్వాదం ఉంటే బాగుంటుందని వచ్చారన్నారు. ఆయన పశ్చాత్తాపం పొంది విగ్రహారాధనను విడిచిపెడితే దేవుడు కచ్చితంగా జగన్ మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేస్తాడు.. ఆయన పశ్చాత్తాప పడకుండా విగ్రహారాధన చేస్తుంటే మాత్రం దేవుని ఉగ్రతను, దేవుని ఆగ్రహాన్ని రుచిచూడాల్సి వుంటుంది.. అని వ్యాఖ్యానించినట్లు మీడియా వస్తున్నాయి. 
 
అంతేగాకుండా వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా చనిపోవడానికి కారణం నాడు విగ్రహారాధన చేయడమేనని పాస్టర్ డేవిడ్ కరుణాకరన్ వ్యాఖ్యలు చేశారు. అయితే పాస్టర్ ఆపై మాట మార్చారు. విగ్రహారాధన చేయొద్దని ఏసు ప్రభు ప్రత్యేకించి చెప్పలేదు. విగ్రహారాధన వల్లే వైఎస్ రాజశేఖరరెడ్డి గారు చనిపోయారేమో అన్నానే కానీ.. చనిపోయారు అని చెప్పలేదని మాటమార్చారు. హిందువులను తాను కించపరచలేదన్నారు. క్రైస్తవుల కోసమే ఆ ప్రసంగం చేశానని.. మనమంతా భారతీయులమని వివరణ ఇచ్చారు.