టీ సీఎం షర్మిల... రాష్ట్రపతి విజయమ్మ అంటారు : మంత్రి ఆదినారాయణ రెడ్డి
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి అధికార తెలుగుదేశం పార్టీలో చేరి మంత్రి పదవిని అనుభవిస్తున్న ఆదినారాయణ రెడ్డి మరోమారు తీవ్ర విమర్శలు గుప్పించారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి అధికార తెలుగుదేశం పార్టీలో చేరి మంత్రి పదవిని అనుభవిస్తున్న ఆదినారాయణ రెడ్డి మరోమారు తీవ్ర విమర్శలు గుప్పించారు.
జగన్ చేపట్టిన 'ప్రజా సంకల్ప యాత్రపై' ఆయన స్పందిస్తూ, సభలకు, పెళ్లిళ్లకు వచ్చే జనాలు ఓట్లు వేయరన్నారు. 2014 ఎన్నికలకు ముందు బొత్స సత్యనారాయణ, రఘువీరా రెడ్డిలు భారీ స్థాయిలో పెళ్లిళ్లు జరిపారని... అయినా, ఎన్నికల్లో వారిద్దరికీ డిపాజిట్లు కూడా దక్కలేదని గుర్తుచేశారు.
పాదయాత్రకు స్వల్ప విరామం ఇచ్చిన జగన్... ప్రస్తుతం అత్తగారింటికి (సీబీఐ కోర్టు) వెళ్లారంటూ మంత్రి ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోవడం చాలా బాగుందన్నారు. వైసీపీ వైరస్ లాంటిదని... వైరస్ లేకపోతే ఎంత బాగుంటుందో, సభలో వైసీపీ లేకపోవడం కూడా అలాగే ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిని తానే అంటూ జగన్ ప్రచారం చేసుకుంటున్నారని... ఆయనను ఇలాగే వదిలేస్తే తెలంగాణకు షర్మిల సీఎం అవుతుందని, విజయమ్మ రాష్ట్రపతి అవుతారని చెబుతారని మంత్రి ఆదినారాయణ రెడ్డి ఎద్దేవా చేశారు.