శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: శనివారం, 4 నవంబరు 2017 (14:49 IST)

తిరుమల ఆలయ డిక్లరేషన్ పైన సంతకం చేయని జగన్ (వీడియో)

ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి తిరుమల ఆలయ నిబంధనలను పట్టించుకోలేదు. ఆలయ నిబంధనల ప్రకారం మతం మారినవారు ఎవరైనా సంతకం చేసిన తరువాతనే ఆలయంలోకి ప్రవేశించాలి. హిందుత్వంపై తనకు నమ్మకం ఉంది... తను శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నాను అని సంతకం చేసిన తరువాత

ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి తిరుమల ఆలయ నిబంధనలను పట్టించుకోలేదు. ఆలయ నిబంధనల ప్రకారం మతం మారినవారు ఎవరైనా సంతకం చేసిన తరువాతనే ఆలయంలోకి ప్రవేశించాలి. హిందుత్వంపై తనకు నమ్మకం ఉంది... తను శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నాను అని సంతకం చేసిన తరువాతనే ఆలయంలోకి వెళ్ళాలి. 
 
కానీ జగన్ అదేమీ చేయలేదు. నేరుగా ఈ రోజు ఉదయం వైకుంఠం నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకున్నారు. ఇదిలా ఉంటే ఆయన వెంట వచ్చిన వైసిపి నేతలందరూ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. అది కూడా సేవా టిక్కెట్లు లేకుండా దర్శనం చేసుకున్నారు. జగన్ వెంట అందరూ వెళ్ళిపోతుండగా టిటిడి సిబ్బంది ఏమీ చేయలేక వారిని వదిలేశారు. కాగా 6వ తేదీ నుంచి జగన్ ప్రారంభించనున్న పాదయాత్ర దిగ్విజయం కావాలని శ్రీవారిని ప్రార్థించారు జగన్. చూడండి వీడియోను..