1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Rajinikanth led Dharman kicks off second schedule with glimpse video showcasing superstar’s striking ne

రజనీకాంత్, కమల్ హాసన్ ధర్మన్ రెండవ షెడ్యూల్ ప్రారంభం

Dharman
Dharman
సూపర్ స్టార్ రజనీకాంత్ ధర్మన్ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ పోస్టర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ది డెడ్లీ డాక్టర్ అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌తో విడుదలైన ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో చాలా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
 
తాజాగా మేకర్స్ రెండవ షెడ్యూల్ ప్రారంచారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియోలో సూపర్ స్టార్ ప్రజెన్స్ అదిరిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
కమల్ హాసన్, సూపర్ స్టార్ రజనీకాంత్ మధ్య ఉన్నంత స్నేహబంధం చాలా అరుదు. భారతీయ చలనచిత్ర రంగంలో ఐదు దశాబ్దాలకు పైగా అగ్రస్థానంలో కొనసాగుతున్న ఈ ఇద్దరు దిగ్గజాలు, ధర్మన్‌ చిత్రం ద్వారా నిర్మాత నటుడిగా మొదటిసారిగా కలిసి పనిచేస్తున్నారు.
 
రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్,ఆర్. మహేంద్రన్ నిర్మిస్తున్న ఈ చిత్రం, RKFI నిర్మాణంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించే మొదటి సినిమా కావడం విశేషం.  
 
భారతీయ చలనచిత్ర రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుని, అత్యంత ఆసక్తికరమైన యువ దర్శకులలో ఒకరిగా పేరు తెచ్చుకున్న అశ్వత్ మారిముత్తు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
 
సూపర్ స్టార్ రజనీకాంత్‌తో పాటు, దక్షిణాది చిత్రసీమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటి సిమ్రాన్,  తమిళ, తెలుగు, హిందీ చిత్రాలలో తన అద్భుత నటనతో గుర్తింపు పొందిన రాశీ ఖన్నా ఈ చిత్రంలో నటిస్తున్నారు.
 
అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలను రూపొందించడంలో పేరుగాంచిన జాతీయ అవార్డు గ్రహీతలు 'అన్బరివ్' ద్వయం యాక్షన్ కొరియోగ్రఫీని నిర్వహిస్తున్నారు. 
 
సినిమాటోగ్రాఫర్ గా నికేత్ బొమ్మిరెడ్డి , కార్తీక్ రాజ్‌కుమార్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రదీప్ ఇ. రాఘవ్ ఎడిటర్‌గా వ్యవహరిస్తుండగా, అన్నదురై ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.  అలాగే డిస్నీ సంస్థ దీనికి సహ-నిర్మాతగా వ్యవహరిస్తోంది.
About Writer
దేవీ
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
ఇంటికి కుమార్తె ఆలస్యంగా వచ్చిందని చెప్పుతో కొట్టిన తండ్రి (వీడియో)