సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: సోమవారం, 6 నవంబరు 2017 (16:26 IST)

జగన్ పాదయాత్ర చూసి ప్రజలు జడుసుకుంటున్నారు... పరిటాల సునీత (వీడియో)

వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి పరిటాల సునీత. జగన్ మోహన్ రెడ్డి అతిపెద్ద ఫ్యాక్షనిస్టని, ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించేందుకే జగన్ పాదయాత్ర చేస్తున్నారన్నారు పరిటాల సునీత. జగన్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నార

వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి పరిటాల సునీత. జగన్ మోహన్ రెడ్డి అతిపెద్ద ఫ్యాక్షనిస్టని, ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించేందుకే జగన్ పాదయాత్ర చేస్తున్నారన్నారు పరిటాల సునీత. జగన్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో ఆయనకే తెలియాలన్నారు. 
 
ఎపి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి తీవ్రంగా కృషి చేస్తోందని, ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపేందుకే పాదయాత్ర చేస్తున్నానని జగన్ చెప్పడం నవ్వు తెప్పిస్తోందన్నారు. జగన్ చేసే పాదయాత్ర అసలు పాదయాత్రే కాదని, పాదయాత్ర అంటే చంద్రబాబు చేసింది మాత్రమేనన్నారు పరిటాల సునీత. 
 
జగన్ పార్టీ నుంచి నేతలు ఒక్కొక్కరుగా తెదేపాలోకి వచ్చేస్తున్నారని ఆయనకు భయం పట్టుకుని ప్రజల్లోకి వెళుతున్నారన్నారు. ప్రజలు కూడా ఆయన పాదయాత్ర చేస్తున్నారని జడుసుకుంటున్నారనీ, వారంతా తెలుగుదేశం ప్రభుత్వంతోనే వున్నారని చెప్పారు. వీడియో చూడండి...