శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By tj
Last Updated : ఆదివారం, 5 నవంబరు 2017 (15:08 IST)

జగన్ పనికిమాలిన పాదయాత్ర అవసరమా : రామకృష్ణ

ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఏ ఉద్దేశంతో చేస్తున్నాడో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.

ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఏ ఉద్దేశంతో చేస్తున్నాడో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఇదే అంశంపై ఆయన ఆదివారం మాట్లాడుతూ, అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీయడం మానేసి ప్రజా సంకల్ప యాత్ర పేరుతో జగన్ చేపట్టిన పాదయాత్ర వల్ల ఎవరికీ ఉపయోగం లేదని విమర్శించారు. అందువల్ల జగన్ తన పార్టీలోని ఎమ్మెల్యేలందరినీ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే విధంగా ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
ఈనెల 16వ తేదీన ప్రత్యేక హోదా కోసం చేపట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమంలో ప్రతిపక్ష పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. వెనుకబడిన రాయలసీమ జిల్లాలకు ఎటువంటి నిధులు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. హోదా ముగిసిన అధ్యాయమని బీజేపీ నేతలు సిగ్గులేకుండా చెప్పడం ఏంటని ఆయన నిలదీశారు.