సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By tj
Last Updated : ఆదివారం, 5 నవంబరు 2017 (14:48 IST)

దమ్ముంటే కమలహాసన్‌ను కాల్చి చంపండి : సిపిఐ జాతీయ నేత నారాయణ

బీజేపీ వచ్చాక హిందూ ఉగ్రవాదం పెరిగిందంటూ వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు కమల్ హాసన్‌‌ను చంపేస్తామని బెదిరింపులకు దిగడం మంచిది కాదని సీపీఐ జాతీయ నేత నారాయణ అంటున్నారు.

బీజేపీ వచ్చాక హిందూ ఉగ్రవాదం పెరిగిందంటూ వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు కమల్ హాసన్‌‌ను చంపేస్తామని బెదిరింపులకు దిగడం మంచిది కాదని సీపీఐ జాతీయ నేత నారాయణ అంటున్నారు. మీకు దమ్ముంటే కమల్ హాసన్‌ను కాల్చండని సవాల్ విసిరారు. అదే జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఉగ్రవాదం ఏ మతంలో ఉన్నా తప్పేనని ఆయన అన్నారు. 
 
మాజీ ఎన్నికల అధికారి భన్వర్ లాల్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోవడాన్ని ఆయన ఖండించారు. ప్రభుత్వ చర్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పోలవరం రాజకీయ ఒత్తిడితోనే పూర్తవుతోందన్నారు. ఈనెల ఎనిమిదో తేదీ నోట్ల రద్దకు వ్యతిరేకంగా నిరసన చేపట్టనున్నట్టు తెలిపారు.