శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr

ఆ హీరోను డీల్ చేయాలంటే కాల్చి చంపడమే ఉత్తమట...

హిందూ తీవ్రవాదం పెరిగిపోతోందంటూ హీరో కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై వేడి రాజుకుంటుంది. కమల్‌ హాసన్‌ను కాల్చి చంపాలంటూ అఖిల భారతీయ హిందూ మహాసభ ఉపాధ్యక్షుడు అశోక్‌ శర్మ పిలుపునిచ్చారు.

హిందూ తీవ్రవాదం పెరిగిపోతోందంటూ హీరో కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై వేడి రాజుకుంటుంది. కమల్‌ హాసన్‌ను కాల్చి చంపాలంటూ అఖిల భారతీయ హిందూ మహాసభ ఉపాధ్యక్షుడు అశోక్‌ శర్మ పిలుపునిచ్చారు. కమల్‌ వంటి వ్యక్తులను డీల్‌ చేయాలంటే కాల్చిచంపడం లేదా ఉరి తీయడం ఒక్కటే మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
హిందూ మహాసభకు చెందిన మరో నేత అయితే కమల్‌ అతని కుటుంబ సభ్యుల సినిమాలు బహిష్కరించాలని పిలుపిచ్చారు. కమల్‌పై క్రిమినల్‌ పరువునష్టం కేసు పెట్టాలన్న పిటిషన్‌ను వారణాసి కోర్టు విచారణకు స్వీకరించింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.