శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 26 అక్టోబరు 2017 (14:23 IST)

పుట్టిన రోజు నాడే విశ్వనటుడి కొత్త పార్టీకి శ్రీకారం

తమిళ సీనియర్ నటుడు కమల్ హాసన్ రాజకీయ రంగప్రవేశానికి అంతా సిద్ధం చేసుకున్నారు. తన పుట్టిన రోజున నాడే కొత్త పార్టీని స్థాపించనున్నారు. అంటే నవంబరు ఏడో తేదీన కొత్త పార్టీని ఏర్పాటు చేస్తారనే ప్రచారంజోరుగ

తమిళ సీనియర్ నటుడు కమల్ హాసన్ రాజకీయ రంగప్రవేశానికి అంతా సిద్ధం చేసుకున్నారు. తన పుట్టిన రోజున నాడే కొత్త పార్టీని స్థాపించనున్నారు. అంటే నవంబరు ఏడో తేదీన కొత్త పార్టీని ఏర్పాటు చేస్తారనే ప్రచారంజోరుగా సాగుతోంది. వాస్తవానికి మహాత్మా గాంధీ జయంతి రోజైన అక్టోబరు 2నే ఆయన కొత్త పార్టీ పేరును వెల్లడిస్తారని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ ఆ రోజున ఆయన ఎలాంటి ప్రకటన చేయలేదు.
 
ఈనేపథ్యంలో కమల్ హాసన్ తన పుట్టిన రోజునాడు కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నారంటూ తమిళ మీడియా గట్టిగా చెపుతోంది. పార్టీ పేరు, గుర్తు విషయంలో ఆలస్యం కావడంతో అక్టోబర్ 2వ తేదీన ఆ వివరాలను వెల్లడించలేదనీ, కానీ, నవంబర్ 7వ తేదీన కొత్త పార్టీ పేరు ప్రకటించాలని కమల్ హాసన్ నిర్ణయించారని సమాచారం.
 
కొంతకాలంగా తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ మీద కమల్ విమర్శలు చేస్తున్నారు. అవినీతి మంత్రులు బండారం సోషల్ మీడియాలో పెట్టాలని కమల్ హాసన్ తన అభిమానులకు సూచించి కలకలం సృష్టించారు. తమిళనాడులో ఇటీవల డెంగ్యూ జ్వరం ఎక్కువ కావడంతో కమల్ హాసన్ ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.