శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 27 అక్టోబరు 2017 (09:06 IST)

బర్త్‌డే రోజున పార్టీ లేదూ.. ఏమీలేదు : కమల్ హాసన్

తన పుట్టిన రోజు వేడుకల రోజున పార్టీని ప్రారంభించనున్నట్టు వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదనీ, అవార్తలన్నీ కేవలం పుకార్లేనని సినీ నటుడు కమల్ హాసన్ స్పష్టం చేశారు. నవంబర్ ఏడో తేదీన కమల్ తన పుట్టిన రోజు

తన పుట్టిన రోజు వేడుకల రోజున పార్టీని ప్రారంభించనున్నట్టు వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదనీ, అవార్తలన్నీ కేవలం పుకార్లేనని సినీ నటుడు కమల్ హాసన్ స్పష్టం చేశారు. నవంబర్ ఏడో తేదీన కమల్ తన పుట్టిన రోజున జరుపుకోనున్న విషయం తెల్సిందే. అదే రోజున‌ రాజకీయ పార్టీ పెడ‌తార‌ంటూ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 
 
ఈ వార్త‌ల‌పై క‌మ‌ల్ స్పందించారు. వ‌చ్చేనెల‌ 7వ తేదీన పార్టీ ప్రకటన ఉండబోదని తేల్చి చెప్పారు. త‌న‌ అభిమానులతో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటానని స్ప‌ష్టంచేశారు. ఆ రోజున ప‌లు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని ప్రకటిస్తానని చెప్పారు. మీడియాలో వ‌స్తోన్న కథనాలు నిజం కాద‌న్నారు. అభిమానులతో భేటీ కావడం చాలా సంవత్సరాల నుంచి కొనసాగుతున్న సంప్రదాయమన్నారు. 
 
ఇకపోతే, దేశ భక్తిపై ఆయన ఓ ట్వీట్ చేశారు. "నా దేశ భక్తి ఎక్కడబడితే అక్కడ పరీక్షించేది కాదు. దూరదర్శన్‌(డీడీ) టీవీ చానల్‌లో ప్రతి రోజూ అర్థరాత్రి పూట జాతీయ గీతాన్ని ప్రసారం చేయండి. సింగపూర్‌ ప్రభుత్వం ప్రతి రోజూ అర్థరాత్రి ఆ దేశ జాతీయ గీతాన్ని ప్రసారం చేస్తుంది. అలాగే ఇక్కడ డీడీలోనూ జాతీయ గీతం ప్రసారం చేయాలి. నా దేశ భక్తిని పరీక్షించేలా ఒత్తిడి చేయొద్దు" అంటూ వ్యాఖ్యానించారు.