గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 18 అక్టోబరు 2017 (14:01 IST)

పెద్ద నోట్ల రద్దును సమర్థించి ప్రశ్చాత్తాపడుతున్నా : కమల్ హాసన్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తీసుకున్న అతిపెద్ద నిర్ణయం దేశంలో చలామణిలో ఉన్న పెద్ద నోట్లను రద్దు చేయడం. నల్లధనం వెలికితీతలో భాగంగా ఈ నోట్లను రద్దు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తీసుకున్న అతిపెద్ద నిర్ణయం దేశంలో చలామణిలో ఉన్న పెద్ద నోట్లను రద్దు చేయడం. నల్లధనం వెలికితీతలో భాగంగా ఈ నోట్లను రద్దు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఆరంభంలో ఈ నోట్ల రద్దును అనేక మంది సమర్థించారు. ఇలాంటి వారిలో హీరో కమల్ హాసన్ ఒకరు. అయితే, ఇపుడు ప్రజలకు సారీ చెపుతున్నారు. గతంలో తాను ఆత్రుతలో పెద్ద నోట్ల రద్దుకు అనుకూల వైఖరిని ప్రకటించానని చెప్పారు. ఇందుకు తాను పశ్చాత్తాపపడుతున్నట్లు తెలిపారు.
 
ఆయన బుధవారం ఓ తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న తర్వాత, దాని అమలులో ఉన్నసమస్యలను తాను తెలుసుకున్నానని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు వల్ల సామాన్యులకు చాలా కష్టాలు ఎదురయ్యాయని, అనుకున్న ఫలితాలు రాలేదన్నారు. అంటే మోడీ తీసుకున్న నిర్ణయం బెడిసికొట్టిందని కమల్ హాసన్ అభిప్రాయపడ్డారు.