సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 9 అక్టోబరు 2017 (10:30 IST)

తమిళనాడు ముఖ్యమంత్రిగా అన్బుమణి కావాలి : చారుహాసన్

సినీ నటుడు కమల్ హాసన్ త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నబంవర్ 7వ తేదీన ఆయన రాజకీయ పార్టీని ప్రవేశపెట్టబోతున్నట్టు ప్రకటించారు. అయితే, ఆయన సోదరుడు, జాతీయ ఉత్తమ నటుడు చారుహాస

సినీ నటుడు కమల్ హాసన్ త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నబంవర్ 7వ తేదీన ఆయన రాజకీయ పార్టీని ప్రవేశపెట్టబోతున్నట్టు ప్రకటించారు. అయితే, ఆయన సోదరుడు, జాతీయ ఉత్తమ నటుడు చారుహాసన్‌ సంచనల వ్యాఖ్యలు చేశారు. 
 
ఓ ప్రైవేట్ చానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ, కమల్ హాసన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎంతమాత్రమూ లేవని, ఆయనకు అధికారం దక్కదని అన్నారు. ఇక రజనీకాంత్ పేరును ప్రస్తావిస్తూ, ఆయనసలు రాజకీయాల్లోకే రాబోరని అభిప్రాయపడ్డారు. 
 
ఇక ప్రస్తుతం ఉన్న నేతల్లో సీఎం కాగల అవకాశం ఎవరికి ఉందన్న ప్రశ్నకు కేంద్ర మాజీ మంత్రి, పీఎంకే యూత్ వింగ్ ప్రెసిడెంట్ అన్బుమణి రాందాస్ పేరు చెప్పారు. వచ్చే నెల 7వ తేదీన కమల్ హాసన్ తన పార్టీ పేరు, జెండా, అజెండాలను ప్రకటిస్తారని వార్తలు వస్తున్న వేళ, సొంత సోదరుడికే నమ్మకం కలిగించలేకపోయారని విశ్లేషకులు అంటున్నారు.